• Home »
  • Legal Issues »
  • ఒప్పందాన్ని ఉల్లంఘించాడంటూ సిద్ధూ మీద కోర్టుకెక్కిన స్టార్ ఇండియా

ఒప్పందాన్ని ఉల్లంఘించాడంటూ సిద్ధూ మీద కోర్టుకెక్కిన స్టార్ ఇండియా

మాజీ క్రికెట్ ఆటగాడు, వ్యాఖ్యాత నవజోత్ సింగ్ సిద్ధు మీద స్టార్ ఇండియా బొంబాయ్ హైకోర్టులో చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. స్టార్ ఇండియాకు మాత్రమే పనిచేసేలా ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి సిద్ధూ సోనీ గ్రూప్ సంస్థ మల్టీ స్క్రీన్ మీడియాకోసం ఐపిఎల్ కి పని చేయటానికి ఒప్పుకున్నందుకు స్టార్ ఇండియా ఇప్పుడు కోర్టుకెక్కింది. ఒప్పందం ప్రకారం సిద్ధూ మొదటి సంవత్సరం 150 రోజులు, ఆ తరువాత రెండేళ్ళూ 180 రోజుల చొప్పున కామెంటరీ చెప్పాల్సి ఉంది

మూడేళ్ళపాటు స్టార్ ఇండియాకు మాత్రమే పనిచేసేలా ఆ సంస్థ సిద్ధూకి రూ. 22 కోట్ల 50 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. నిబంధనల ప్రకారం సిద్ధూ మరే ఇతర సంస్థకూ పనిచేయకూడదు. అయితే, ఆ నిబంధనలను అతిక్రమించి సోనీ గ్రూప్ లో ప్రసారమయ్యే ఎక్స్ ట్రా ఇన్నింగ్స్ అనే కార్యక్రమంలో పాల్గొనటం ఈ వివాదానికి కారణమైంది. స్టార్ ఇండియా బొంబాయ్ హైకోర్టులోపిటిషన్ దాఖలు చేస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన సిద్ధూ నుంచి ఫీజు తిరిగి ఇప్పించాలని కోరింది.

జస్టిస్ ఆర్ డి ధనూకా ఈ పిటిషన్ ను విచారణకు తీసుకుని ముంబయ్ కి చెందిన న్యాయవాది అంధ్యార్జున ను ఆర్బిట్రేటర్ గా నియమించింది. ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం సిద్ధూ మొదటి సంవత్సరం 150 రోజులు, ఆ తరువాత రెండేళ్ళూ 180 రోజుల చొప్పున కామెంటరీ చెప్పాల్సి ఉంది. ఒప్పందంలో భాగంగా అడ్వాన్స్ రూపంలో 8 కోట్లు తీసుకుని మొదటి సంవత్సరం 41 రోజులు మాత్రమే కామెంటరీ చెప్పారు. స్టార్ ఇండియాకు మాత్రమే పనిచేసేలా కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారని, వివరణ ఇవ్వటానికి నోటీసులిచ్చినా రాలేదని ఆర్బిట్రేటర్ నివేదిక ఇవ్వటంతో కోర్టు తదుపరి చర్యలు మొదలుపెట్టాల్సి ఉంది.