• Home »
  • Entertainment »
  • స్టార్ ఆధ్వర్యంలో త్వరలో రొమాన్స్ చానల్

స్టార్ ఆధ్వర్యంలో త్వరలో రొమాన్స్ చానల్

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జారీ చేసిన 12 కొత్త లైసెన్సులలో సోనీ గ్రూపు ప్రారంభించబోయే ప్రాంతీయ చానల్స్ కు ఐదు కాగా  స్టార్ ఇండియా, వయాకామ్ 18 కు ఒక్కొక్క సినిమా చానల్ కు లైసెన్సులు వచ్చాయి. వయాకామ్ 18 చానల్ రిష్టే సినీప్లెక్స్ పేరుతో చానల్ అందించబోతున్నట్టు ప్రకటించగా స్టార్ ఇవ్వబోయే సినిమా చానల్ పేరు స్టార్ గోల్డ్ రొమాన్స్. దీనికోసం ఇటీవలే దూరదర్శన్ వారి ఉచిత డిటిహెచ్ ప్లాట్ ఫామ్ డిడి ఫ్రీడిష్ లో ఒక స్లాట్ తీసుకోవటం గమనార్హం. అందుకే ఇది ఉచిత చానల్ గా అందుబాటులోకి వస్తుందనే ప్రచారం కూడా మొదలైంది.

తాజాగా లైసెన్స్ పొందిన చానల్స్ జాబితాలో సబ్ బంగ్లా, సబ్ తమిళ్, సబ్ పంజాబీ, సబ్ తెలుగు, సబ్ మరాఠీ, జ్యువెల్ అలయెన్స్, స్టార్ గోల్డ్ రొమాన్స్, టెన్ 2 హెచ్ డి, రిష్టే సినీప్లెక్స్, వియాన్ టీవీ, జీ 24 బిజినెస్, జీ 24 బిజినెస్, జీ బీహార్ ఝార్ఖండ్ ఉన్నాయి.