• Home »
  • BARC »
  • ఆలిండియా టాప్ 10 లో స్టార్ మా, జెమిని

ఆలిండియా టాప్ 10 లో స్టార్ మా, జెమిని

ఆలిండియా టీవీ రేటింగ్స్ జాబితాలో స్టార్ మా, జెమిని టీవీ స్థానం సంపాదించుకున్నాయి. గతవారం ఈటీవీకి కూడా స్థానం దక్కగా ఈ సారి రెండు చానల్స్ కు మాత్రమే అవకాశం లభించింది. సంక్రాంతి వారం కావటంవల్లనే మూడో వారంలో రేటింగ్స్ గణనీయంగా ఉన్నాయి.

ఎప్పటిలాగానే సన్ టీవీ అత్యధిక రేటింగ్స్ తో నెంబర్ వన్ స్థానంలో ఉండగా దానికంటే దాదాపు 30 శాతం తక్కువ వీక్షణలు సాధించిన జీ అన్మోల్ రెండో స్థానంలో నిలబడింది. స్టార్ భారత్ మూడో స్థానంలో, సోనీ మాక్స్ నాలుగో స్థానంలో సోనీ పాల్ ఐదో స్థానంలో ఉన్నాయి.

జీటీవీ, కలర్స్, స్టార్ ఉత్సవ్ వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాలు దక్కించుకోగా స్టార్ మా తొమ్మిదో స్థానం, జెమిని పదో స్థానం సంపాదించుకొనిన్ టాప్ టెన్ జాబితాలో స్థానం పదిలపరచుకున్నాయి.

 

రాంకు చానల్ వారంలో వీక్షణలు ( వేలల్లో  
   1 సన్ టీవీ 1047704
2 జీ అన్మోల్ 722702
3 స్టార్ భారత్ 697485
4 సోనీ మాక్స్ 639675
5 సోనీ పాల్ 600018
6 జీ టీవీ 595585
7 కలర్స్ 583116
8 స్టార్ ఉత్సవ్ 569417
9 స్టార్ మా 532247
10 జెమిని టీవీ 522878