• Home »
  • DART »
  • టాప్ 5 జాబితాలోకి స్టార్ మా సీరియల్స్

టాప్ 5 జాబితాలోకి స్టార్ మా సీరియల్స్

తెలుగు టీవీ చానల్స్ లో ప్రసారమవుతున్న కార్యక్రమాల టాప్ 5 జాబితాలో సీరియల్స్ కే అగ్రస్థానం దక్కుతుండగా అందులో ఈటీవీ, జీ తెలుగులో ప్రసారమయ్యే సీరియల్స్ మాత్రమే ఉంటూ వస్తున్నాయి. గతంలో ఈటీవీ  జబర్దస్ట్ కూదా తరచు కనిపించినా ఈ మధ్య కాలంలో చాలా అరుదుగా మాత్రమే ఆ స్థాయి రేటింగ్స్ తెచ్చుకోగలుగుతోంది.  జనవరి 20-26 మధ్య వారంలో మా టీవీ సీరియల్స్ రెండింటికి టాప్ 5 లో అవకాశం వచ్చింది.

కథ పరంగా మలుపులు తిరుగుతూ ఉత్కంఠ కలిగిస్తుండటం వల్లనే కుంకుమ పువ్వు, కోయిలమ్మ సీరియల్స్ మూడు, నాలుగు రాంకులు దక్కించుకున్నాయి.  ఈటీవీ సీరియల్స్ స్వాతి చినుకులు, మనసు మమత ఇంతకుముందులాగే మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. జీ తెలుగు సీరియల్ ముద్దమందారం కూడా ఈ వారం ఐదో స్థానంలో ఉండి టాప్ 5 లో  స్థానాన్ని కాపాడుకోగలిగింది.

 

చానల్ కార్యక్రమం వీక్షణలు ( వేలల్లో ) రాంకు
ఈటీవీ స్వాతి చినుకులు 8299 1
ఈటీవీ మనసు మమత 7352 2
స్టార్ మా కుంకుమ పువ్వు 7306 3
స్టార్ మా కోయిలమ్మ 7120 4
జీ తెలుగు ముద్దమందారం 6995 5