• Home »
  • BARC »
  • ’స్టార్ మా’ సీరియల్స్ కే అగ్రస్థానం

’స్టార్ మా’ సీరియల్స్ కే అగ్రస్థానం

తాజా వారంలో ఈటీవీ సీరియల్స్ వెనుకబడ్డాయి. దీంతో సీరియల్స్ లో స్టార్ మా అగ్రస్థానం సంపాదించుకోగలిగింది. స్టార్ మా లో ప్రసారమయ్యే కోయిలమ్మ  అన్ని కార్యక్రమాల జాబితాలో మొదటి రాంకులో ఉండగా  కార్తీక దీపం మూడో రాంకులో, కుంకుమ పువ్వు నాలుగో రాంకులో ఉన్నాయి.

ఈటీవీ కార్యక్రమాలలో స్వాతి చినుకులు సీరియల్ ఒక్కటే రెండో రాంకు సంపాదించుకోగలిగింది. స్టార్  మా లో ప్రసారమైన సినిమా జయ జానకీనాయక ఐదో స్థానంలో నిలిచింది. జెమిని, జీ తెలుగు చానల్స్ లో ప్రసారమైన కార్యక్రమాలేవీ మొదటి ఐదు స్థానాల్లో స్థానం దక్కించుకోలేకపోయాయి.

 

రాంకు చానల్ కార్యక్రమం వీక్షణలు ( వేలల్లో)
1 స్టార్ మా కోయిలమ్మ 7534
2 ఈటీవీ తెలుగు స్వాతి చినుకులు 7315
3 స్టార్ మా కార్తీకదీపం 7214
4 స్టార్ మా కుంకుమ పువ్వు 7204
5 స్టార్ మా చిత్రం- జయ జానకీ నాయక 7120