• Home »
  • BARC »
  • మళ్ళీ నెం.1 స్థానంలోకి స్టార్ ప్లస్

మళ్ళీ నెం.1 స్థానంలోకి స్టార్ ప్లస్

ఈ ఏడాది 38 వ వారానికి గాను బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) విడుదల చేసిన ప్రేక్షకాదరన డేటా ప్రకారం స్టార్ ప్లస్ బగా పుంజుకొని మళ్ళీ తన మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగలిగింది. అంతకుముందు వారాల్లో వరుసగా కలర్స్ తన అధిక్యం చాటుకుంటూ నెంబర్ వన్ స్థానంలోకి దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఒక్క సారిగా కలర్స్ బాగా తగ్గటంతో పరిస్థితి తారుమారైంది. తాజా వారంలో రెండో స్థానానికి పరిమితమైంది. జీ టీవీ మూడో స్థానంలో ఉండగా లైఫ్ ఓకే నాలుగో స్థానంలోనూ, సబ్ టీవీ ఐదో స్థానంలోనూ కొనసాగాయి.

స్టార్ ప్లస్ వరి సాథ్ నిభానా సాథియా హిందీ చానల్స్ టాప్ ఫైవ్ కార్యక్రమాల్లో మొదటి స్థానం సంపాదించుకుంది. జీ టీవీ కుంకుమ్ భాగ్య కు రెండో స్థానం, కలర్స్ వారి ససురాల్ సిమర్ కా మూడో స్థానం, స్టార్ ప్లస్ లో ప్రసారమయ్యే దియా ఔర్ బాటీ హమ్ కి నాలుగో ర్యాంక్, కలర్స్ చానల్ వారి ఉడాన్ కి ఐదో ర్యాంక్ దక్కాయి.

ఇంగ్లీష్ న్యూస్ చానల్స్ విభాగలో టైమ్స్ నౌ మొదటి స్థానంలో ఉండగా, ఆ తరువాత స్థానంలో ఇండియా టుడే టీవీ, మూడో స్థానంలో సి ఎన్ ఎన్ ఐబిఎన్ ఉన్నాయి.