• Home »
  • Entertainment »
  • టామ్ రేటింగ్స్ లో స్టార్ ప్లస్ నెం.1

టామ్ రేటింగ్స్ లో స్టార్ ప్లస్ నెం.1

అక్టోబర్ 18-24 మధ్య వారానికి టామ్ ఇండియా అందించిన ప్రేక్షకాదరణ సమాచారం ప్రకారం స్టార్ ప్లస్ మళ్ళీ తన నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకుంది. రెండు వారాలపాటు కలర్స్ సొంతం చేసుకున్న నెంబర్ వన్ స్థానాన్ని ఇప్పుడు స్టార్ ప్లస్ తిరిగి సాధించుకుంది. కలర్స్ చానల్ 40 జీఆర్పీలు కోల్పోవటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సోనీ 12 జీఆర్పీలు, లైఫ్ ఓకే 11 జీఆర్పీలు మెరుగుపడ్డాయి. డిడి నేషనల్ ఎదుగుదలబాటలో సాగుతూ వస్తోంది. అదనంగా 20 జీఆర్పీలు పెంచుకొని 67 జీఆర్పీలకు చేరుకుంది.

మొత్తంగా చూస్తే స్టార్ ప్లస్ నెంబర్ వన్ స్థానంలో ఉండగా కలర్స్ రెండో స్థానంలో, జీ టీవీ మూడో స్థానంలో, సోనీ సన్ నాలుగో స్థానంలో, లైఫ్ ఓకే ఐదో స్థానంలో ఉన్నయి. సోనీ ఎంటర్టైన్మెంట్ కుఆరో స్థానం, &టీవీకి ఏడో స్థానం, డిడి నేషనల్ కు ఎనిమిదో స్థానం, జీ అన్మోల్ కు తొమ్మిదో స్థానం, రిష్తే కి పదో స్థానం దక్కాయి.

హిందీ మూవీస్ విభాగంలో స్టార్ గోల్డ్, సోనీ మాక్స్, జీ సినిమా వరుసగా మూడు స్థానాలు సంపాదించుకున్నాయి. హిందీ న్యూస్ చానల్స్ విషయానికొస్తే, ఆజ్ తక్ కు మొదటి స్థానం, ఇండియా టీవీ కి రెండో స్థానం, ఎబిపి న్యూస్ కి మూడో స్థానం లభించాయి. మ్యూజిక్ చానల్స్ లో ఎంటీవీ కి నెంబర్ వన్ స్థానం లభించగా మస్తీ రెండో స్థానంలో, 9X M మూడో స్థానంలో ఉన్నాయి.