• Home »
  • BARC »
  • హిందీ చానల్స్ లో మళ్ళీ స్టార్ నెం.1

హిందీ చానల్స్ లో మళ్ళీ స్టార్ నెం.1

ఈ ఏడాది నాలుగో వారానికి గాను బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అందజేసిన ప్రేక్షకాదరణ సమాచారం ప్రకారం స్టార్ ప్లస్ మళ్ళీ నెంబర్ వన్ స్థానం సంపాదించుకుంది. ఐదు వారాల పాటు కలర్స్ మొదటి స్థానంలో ఉన్నప్పటికీ తాజా వారంలో స్టార్ ముందుకు రాగలిగింది. కలర్స్ రెండో స్థానానికి పరిమితమైంది.

జీ టీవీ మూడో స్థానంలో ఉండగా, అదే జీ నెట్ వర్క్ కు చెందిన ఉచిత ( ఫ్రీ టు ఎయిర్ ) చానల్ జీ అన్మోల్ నాలుగో స్థానం సంపాదించగలిగింది. స్టార్ ఇండియా వారి ఉచిత చానల్ స్టార్ ఉత్సవ్ ఐదో ర్యాంకులో ఉంది. సోనీ పాల్ ఆరో స్థానం, రిష్టే ఏడో స్థానం, లైఫ్ ఓకే ఎనిమిదో స్థానం, సబ్ టీవీ తొమ్మిదో స్థానం సంపాదించుకున్నాయి. డిడి నేషనల్ మాత్రం పదో రాంకుతో సరిపెట్టుకుంది.