• Home »
  • Entertainment »
  • కన్నడ చానల్స్ పేర్లు మార్చిన స్టార్ గ్రూప్: ఇక మీదట స్టార్ సువర్ణ, స్టార్ సువర్ణ ప్లస్

కన్నడ చానల్స్ పేర్లు మార్చిన స్టార్ గ్రూప్: ఇక మీదట స్టార్ సువర్ణ, స్టార్ సువర్ణ ప్లస్

ఇప్పటిదాకా ప్రాంతీయ భాషల్లో హెచ్ డి చానల్స్ ప్రారంభించటం మీద దృష్టి సారించిన స్టార్ ఇండియా సంస్థ ఇప్పుడు ఆ ప్రాంతీయ చానల్స్ పేర్లు మార్చటం మొదలుపెట్టింది. దక్షిణాదిమీద దృష్టిపెట్టి తొమ్మిదేళ్ళ కిందట సొంతం చేసుకున్న కన్నడ చానల్ సువర్ణ ను, ఆ తరువాత దానికి అనుబంధం గా ప్రారంభించిన సువర్ణ ప్లస్ ను ఇప్పుడు స్టార్ పేరు తగిలించి పిలవాలని నిర్ణయించింది. దీంతో సువర్ణ చానల్ ఇకమీదట స్టార్ సువర్ణగా, కన్నడ సినిమాల చానల్ సువర్ణ ప్లస్ ఇకమీదట స్టార్ సువర్ణ ప్లస్ గా అందుబాటులోకి  వస్తాయి.

అధికారికంగా ఈ నెల 25 నుంచి కొత్త లోగోలు తెరమీద కనిపిస్తాయని తెలుస్తోంది. స్టార్ సువర్ణ పేరు మార్చుతున్న సందర్భంగా అదే రోజు నుంచి హరహర మహాదేవ సీరియల్ ప్రసారమవుతుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ సాయంత్రం 7.30 కి ఈ సీరియల్ అందుబాటులో ఉంటుందని స్టార్ ప్రకటించింది. ఇలా ఉండగా సినిమాల చానల్ గా పేరుమోసిన సువర్ణ ప్లస్ ఇకమీదట స్టార్ సువర్ణ ప్లస్ గా మారటంతోబాటు సినిమా, స్పోర్ట్స్ చానల్ గా ఉంటుంది.