• Home »
  • Other Channels »
  • 29న ఆధ్యాత్మిక చానల్ ’జ్ఞాన యోగి’ ప్రారంభం

29న ఆధ్యాత్మిక చానల్ ’జ్ఞాన యోగి’ ప్రారంభం

తెలుగునాట మరో ఆధ్యాత్మిక చానల్ ప్రసారం కాబోతోంది. రచన బ్రాడ్ కాస్టింగ్ వారి భక్తి చానల్, టిటిడి వారి శ్రీవెంకటేశ్వర, ఇమేజ్ బ్రాడ్ కాస్టింగ్ వారి సివిఆర్ ఓమ్, 6 టీవీ నిర్వాహకుల దర్శనమ్ ఇప్పటికే నడుస్తుండగా స్టుడియో ఎన్ చానల్ యాజమాన్యం ఈ నెల 29 న శ్రావణ పౌర్ణమి సందర్భంగా ‘ జ్ఞాన యోగి ‘ చానల్ ను లాంఛనంగా ప్రారంభించబోతోంది.

నాలుగు నెలలుగా టెస్ట్ సిగ్నల్ నడుపుతూ వస్తున్న ఈ చానల్  ఇకమీదట అధికారికంగా ప్రసారాలందిస్తుంది. పే చానల్ గా ప్రకటించకపోయినా, ఎన్ క్రిప్ట్ చేసి ప్రసారం చేయాలని నిర్ణయించటాన్ని బట్టి భవిష్యత్తులో పే చానల్ గా మార్చుకునే అవకాశాన్ని చేతుల్లో పెట్టుకుంది. ఇప్పటి వరకు తెలుగులో ఆధ్యాత్మిక చానల్స్ అన్నీ  ఉచిత ప్రసారాలందిస్తూ వస్తున్నాయి.