• Home »
  • National Channels »
  • 11న లివింగ్ పుడ్జ్, త్వరలో మరో 4 కొత్త చానల్స్, ఖానా ఖజానా మూసివేత

11న లివింగ్ పుడ్జ్, త్వరలో మరో 4 కొత్త చానల్స్, ఖానా ఖజానా మూసివేత

జీ గ్రూప్ అధిపతి సుబాష్ చంద్ర లివింగ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి ఐదు కొత్త చానల్స్ ప్రారంభించటానికి రంగం సిద్ధం చేశారు. ఎస్సెల్ గ్రూప్ లో భాగంగా ఇప్పటికే జీ సంస్థలు టీవీ రంగంలో ఉండగా ఇప్పుడు వస్తున్న కొత్త చానల్స్ అన్నీ లివింగ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో భాగంగా ఉంటాయి. ముందుగా ఈ నెల 11న జీ ఫుడ్జ్ చానల్ ప్రారంభమవుతోంది. ఫుడ్, లైఫ్ స్టైల్ ప్రధానాంశాలుగా అంతర్జాతీయ విశేషాలతో ప్రత్యేకంగా భారతీయ ప్రేక్షకులకోసం ఈ చానల్ వస్తోంది. ఇంగ్లీష్ లోనూ, హిందీలోనూ ప్రసారాలుంటాయి.

ఇప్పటికే అమెరికాలో ఏర్పాటైన ’ జీ లివింగ్ ’ తో బాటు భారత నాగరకత మీద దృష్టి సారించే ’లివింగ్ రూట్జ్’, ఇంటీరియర్ డెకరేషన్ మీద ’లివింగ్ హోమ్జ్’, యాత్రాకార్యక్రమాలతో ”లివింగ్ ట్రావెల్జ్ ’కూడా త్వరలో మొదలవుతాయి. అయితే తేదీలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. లివింగ్ నెట్ వర్క్ ఇప్పటివరకూ అంతర్జాతీయ కార్యకలాపాల ద్వారా 80 కోట్లు ఆర్జించగా, వచ్చే నాలుగేళ్ళలో వెయ్యి కోట్లు సంపాదించటం మీద దృష్టిపెట్టిందని జీల్, ఎస్సెల్ గ్రూప్ చైర్మెన్ సుభాష్ చంద్ర చెబుతున్నారు.

’వసుధైవ కుటుంబకం’ నినాదంగా ముందుకు సాగుతున్న జీ సంస్థ తన ప్రేక్షకులలో అంతర్జాతీయ దృక్పథాన్ని పెంచుతున్నట్టు చెబుతోంది. అంతర్జాతీయ కార్యక్రమాలను భారత ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగమే ఈ కొత్త చానల్స్ అంటోంది. అయితే, మొదటి చానల్ లివింగ్ ఫుడ్జ్ ప్రారంభంతో జీ గ్రూప్ ఖానా ఖజానా మూతబడుతోంది.