• Home »
  • Cable/DTH/HITS »
  • మరో 120 చానల్స్ పెంచుకునే ప్రయత్నంలో సన్ డైరెక్ట్ డిటిహెచ్

మరో 120 చానల్స్ పెంచుకునే ప్రయత్నంలో సన్ డైరెక్ట్ డిటిహెచ్

సన్ గ్రూప్ వారి డిటిహెచ్ వేదిక సన్ డైరెక్ట్ ఇప్పుడు పెద్ద ఎత్తున తన చానల్స్ సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో ఉంది. ఇప్పటివరకు 220 స్టాండర్డ్ డెఫినిషన్ ( ఎస్ డి ) చానల్స్ తో బాటు 60 హై డెఫినిషన్ (హెచ్ డి) చానల్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే  టాటా స్కై, డిష్ టీవీ లాంటి డిటిహెచ్ లతో పోల్చుకున్నప్పుడు ఈ సంఖ్య తక్కువే కావటంతో ఉత్తరాది సంస్థలతో పోటీగా అదనపు చానల్స్ ఇవ్వగలిగేలా స్థాయి పెంచుకునే పనిలో పడింది.

ఇటీవలే ప్రయోగించిన మియాశాట్ – 3బి ఉపగ్రహంలో 144 మెగాహెర్ట్జ్ ల స్పెక్ట్రమ్ కేటాయించబడటంతో సన్ డైరెక్ట్ ఇకమీదట మరో100  ఎస్ డి చానల్స్, 20 హెచ్ డి చానల్స్ ఇవ్వగలుగుతుంది. దీంతో సన్ డైరెక్ట్ లో 320 స్టాండర్డ్ డెఫినిషన్ చానల్స్, 80 హెచ్ డి చానల్స్ కలిసి మొత్తం 400 చానల్స్ ఇవ్వగలిగే స్థాయికి చేరుకుంటుంది. సామర్థ్యం పెంచుకోవటానికి అనుమతి కోరుతూ టెలికమ్యూనికేషన్ల విభాగానికి కూడా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది.