• Home »
  • Cable »
  • రాజమండ్రి ’ వాజీ డిజిటల్’ చందాదారుల లెక్క తేల్చాలని టిడిశాట్ ఆదేశం

రాజమండ్రి ’ వాజీ డిజిటల్’ చందాదారుల లెక్క తేల్చాలని టిడిశాట్ ఆదేశం

సన్ గ్రూప్ టీవీ చానల్స్ పంపిణీ సంస్థ సన్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ కు, రాజమండ్రిలోని వాజీ డిజిటల్ నెట్ వర్క్ కు మధ్య కొనసాగుతున్న వివాదం పరిష్కరించుకోవటానికి ఇరుపక్షాలూ కలిసి చందాదారుల లెక్క తేల్చాలని టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పిల్లేట్ ట్రైబ్యునల్ (టిడిశాట్) ఆదేశించింది. ఉమ్మడి తనిఖీలకు సిద్ధమేనని గతవారం జరిగిన సమావేశంలో నిర్ణయించుకున్నట్టు టిడిశాట్ కు తెలియజేయటంతో అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీచేసింది.

అనలాగ్ లో ప్రసారాలు అందిస్తున్న వాజీ డిజిటల్ నెట్ వర్క్ చెప్పే కనెక్షన్ల సంఖ్య విషయంలో విభేదాలు రావటంతో సన్ డిస్ట్రిబ్యూషన్ తో వివాదం మొదలైంది. మే నెలలో ట్రైబ్యునల్ ఆదేశాలు జారీచేస్తూ తాత్కాలికంగా ఇంటర్ కనెక్ట్ ఒప్పందం చేసుకొని సిగ్నల్స్ ఇవ్వాలని చెప్పింది. ఆగస్ట్ 18 న వివాదాస్పద అంశాలన్నిటినీ ప్రస్తావిస్తూ, మూడు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని వాజీ డిజిటల్ ను ఆదేశించింది.

ఈ లోపు ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన కనెక్షన్ల సంఖ్య విషయంలో ఇరుపక్షాలూ ఉమ్మడి తనిఖీకి సిద్ధమని ట్రైబ్యునల్ కు తెలియజేశాయి. అందుకు ఆమోదిస్తూ ఈ నెల 22 న విచారణ చేపడతామని టిడిశాట్ ప్రకటించింది.