• Home »
  • Cable »
  • డెన్ మీద సిగ్నల్ పైరసీ కేసు పెట్టిన సన్

డెన్ మీద సిగ్నల్ పైరసీ కేసు పెట్టిన సన్

జాతీయ స్థాయిలో పేరుమోసిన కేబుల్ పంపిణీ ఎమ్మెస్వో డెన్ నెట్ వర్క్స్  పైరసీకి పాల్పడుతున్నట్టు సన్ గ్రూప్ పంపిణీ సంస్థ సన్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పిల్లేట్ ట్రైబ్యునల్ లో పిటిషన్ దాఖలుచేసింది. ఇంటర్ కనెక్ట్ ఒప్పందం ప్రకారం ఢిల్లీ పరిధిలో మాత్రమే సిగ్నల్స్ ప్రసారం చేయాల్సి ఉండగా డెన్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని సన్ డిస్ట్రిబ్యూషన్ ఆరోపించింది.

డెన్ నెట్ వర్క్స్  నుంచి గుర్గావ్, ఘజియాబాద్ ప్రాంతాలకు కూదా సిగ్నల్స్ వెళ్ళటం ఒప్పందాన్ని ఉల్లంఘించటమేనని సన్ డిస్ట్రిబ్యూషన్ వాదించింది. అయితే, దీనికి సమాధానం దాఖలు చేయటానికి కొమ్త సమయం కావాలని డెన్ తరఫు న్యాయవాది గౌరవ్ కౌశిక్ టిడిశాట్ ను కోరారు. స్పష్టంగా చెప్పాలని టిడిశాట్ కోరగా, డెన్ అలా ఢిల్లీ వెలుపల సన్ టీవీ ప్రసారాలు చేయటం లేదన్నారు. ఈ విచారణ ఈ నెల 13 కు వాయిదా పడింది.