• Home »
  • Legal Issues »
  • ఎఫ్ఎం కేసులో సన్ గ్రూప్ కు తాత్కాలిక ఊరట : 24న విచారణ కొనసాగింపు

ఎఫ్ఎం కేసులో సన్ గ్రూప్ కు తాత్కాలిక ఊరట : 24న విచారణ కొనసాగింపు

ఎఫ్ ఎం రేడియో మూడో దశ వేలం నుంచి సన్ గ్రూప్ కంపెనీలను మినహాయిస్తూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలమీద సన్ గ్రూప్ కు ఈ రోజు ఢిల్లీ హైకోర్టు ఊరటనిచ్చింది. ఈరోజు, రేపు జరిగే నమూనా వేలంలో రెడ్ ఎఫ్ పాల్గొనవచ్చునని చెప్పింది. ఈ కేసు విచారణను 24న మళ్ళీ చేపడతామని చెబుతూ జస్టిస్ బాదర్ దుర్రెజ్ అహ్మద్, జస్టిస్ సంజీవ్ సచ్ దేవ్ ప్రభుతానికి నోటీసుకు జారీచేశారు.

నిన్న జరిగిన వాదోపవాదాలు విన్న అనంతరం సన్ గ్రూపు ను వేలానికి అనుమతించటమో, వేలం వాయిదావేయటమో తేల్చుకోవాలని కోర్టు కేంద్రప్రభుత్వ న్యాయవాదికి  స్పష్టం చేసి విచారణను ఈరోజుకు వాయిదావేసిన సంగతి తెలిసిందే. అయితే, మొత్తం ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయినందున ఇప్పుడు వేలం నిలిపివేయటం కుదరదని ప్రభుత్వం తరఫు న్యాయవాది ఈ రోజు కోర్టుకు తెలియజేశారు.

అయితే, కేసు విచారణను 24 వ తేదీకి వాయిదా వేస్తూ, ఈరోజు, రేపు జరిగే నమూనా వేలంలో పాల్గొనేందుకు సన్ గ్రూప్ కు అనుమతినిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది