• Home »
  • Broadband »
  • హెచ్ ఒ ఒక్యూ లో జెమినీ సహా సన్ గ్రూప్ చిత్రాలు

హెచ్ ఒ ఒక్యూ లో జెమినీ సహా సన్ గ్రూప్ చిత్రాలు

సినిమా, టీవీ పరిశ్రమలు ఇప్పుడు ఓవర్ ద టాప్ (ఒటిటి) ప్లాట్ పామ్స్ మీద దృష్టి సారించాయి. కొంతకాలం పాటు యశ్ రాజ్ ఫిల్స్మ్, షెమారూ ఎంటర్టైన్మెంట్స్ లాంటి సంస్థలతో కలిసి పనిచేసిన ఒటిటి సంస్థ హెచ్ ఒ ఒక్యూ  ఇప్పుడు తాజాగా సన్ గ్రూప్ తో  ఒప్పందం కుదుర్చుకుంది. సన్ గ్రూప్ తన నెట్ వర్క్ లోని దక్షిణాది భాషల చానల్స్ కోసం తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసార హక్కులు కొనుగోలు చేసిన చిత్రాలని ఇప్పుడు హెచ్ ఒ ఒక్యూ   ప్రసారం చేసేలా ఒప్పందం చేసుకుంది.

డిజిటల్ పంపిణీ వేదికగా హెచ్ ఒ ఒక్యూ  సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలు, సన్ గ్రూప్ దగ్గర ఉన్న ప్రతిష్ఠాత్మక చిత్రాలు కలిసి ఆదాయమార్గంగా మారటం సంతోషంగా ఉందని సన్ గ్రూప్ సీఈవో ఎస్ ఎల్ నారాయణన్ అన్నారు.  ఎన్నో అద్భుతమైన చిత్రాలను డిజిటల్ మాద్యమం ద్వారా ప్రేక్షకులకు అందించే అవకాశాన్ని సొంతం చేసుకున్నామని హెచ్ ఒ ఒక్యూ   సీఈవో పీటర్ వ్యాఖ్యానించారు. దాదాపు 30 వేల గంటల నిడివి గల సినిమాలు, టీవీ సిరీస్ తో ఈ మధ్యనే హెచ్ ఒ ఒక్యూ   భారత్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.