• Home »
  • Top Stories »
  • సన్ నెట్ వర్క్ వ్యవహారంలో వెనక్కి తగ్గిన హోంశాఖ?

సన్ నెట్ వర్క్ వ్యవహారంలో వెనక్కి తగ్గిన హోంశాఖ?

kalanidhi_maran

సన్ నెట్ వర్క్ చానల్స్ కు సెక్యూరిటీ క్లియరెన్స్ నిరాకరించటం ద్వారా మొత్తం 33  చానళ్ల  లైసెన్సులను ప్రశ్నార్థకంగా మార్చిన హోంశాఖ మెత్తబడినట్టు తెలుస్తోంది.  కళానిధి మారన్ మీద  పెండింగ్ కేసుల ఆధారంగా హోం మంత్రిత్వశాఖ సెక్యూరిటీ  క్లియరెన్స్ నిరాకరించిందని  భావిస్తుండగా సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ మాత్రం  ముందడుగు వేయలేదు.

కానీ ఒకేసారి 33 చానళ్ల లైసెన్సులు రద్దవటం అనేది చాలా తీవ్రమైన అంశమని  పరిశ్రమలో  చర్చించుకుంటూ ఉండగానే రద్దు అనివార్యమని మీడియాలో వార్తలు  రావటంతో సన్ నెట్ వర్క్  షేర్ల ధరలు 20శాతం పైగా పడిపోవటం తెలిసిందే. గతంలో  డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్  రద్దయినప్పుడు ఎఫ్ ఎం లైసెన్సుల వ్యవహారంలోనూ  కోర్టును ఆశ్రయిమ్చి ఊరట పొందగలిగిన  సన్ నెట్ వర్క్ ఇప్పుడు కూడా కోర్టుకు వెళ్ళే  అవకాశాలున్నాయన్న ఊహాగానాలు  మొదలయ్యాయి.

suntv

అయితే, కళానిధి మారన్ నేరుగా హోం మంత్రిత్వశాఖకు లేఖ రాస్తూ తన తప్పేంటని ప్రశ్నించారు. కేవలం కేసు నమోదు కావటమే అనర్హతకు  కారణమైతే 17 మీడియా సంస్థల అధిపతులు కేసుల్లో ఉన్నారంటూ జాబితా ఇచ్చారు. నేరం నిరూపణకాకముందే దోషిగా తేల్చటం కనీస ప్రాథమిక హక్కులను ఉల్లంఘించటమేనని ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. సన్ నెట్ వర్క్ చానళ్ల లైసెన్సులు రద్దుచేసే పక్షంలో అలాంటి కెసులు ఎదుర్కుంటున్న వారు దైరెక్టర్లుగా ఉన్న సంస్థల టీవీ లైసెన్సులన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేయటంతో హోం శాఖ వెనకగేసింది.

దీంతోఈ సన్ నెట్ వర్క్ మీద చర్యలు నిలిచిపోయాయి. నిజానికి సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దయినట్టు వార్తలు వచ్చిన వెంటనే హోంశాఖ అధికారులు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు కూడా సూచిస్తూ వచ్చారు. కళానిధి మారన్ తనకు బదులు మరెవరినైనా డైరెక్టర్ గా ఉంచితే సమస్య తలెత్తదని చెప్పి చూశారు. కానీ మారన్ అమీతుమీ తేల్చుకోవటానికే సిద్ధపడటంతో హోంశాఖ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.