• Home »
  • BARC »
  • జాతీయస్థాయిలో సన్ నెం.1, ఈటీవీ కి 8వ రాంక్, టాప్ 10నుంచి వైదొలగిన జీ తెలుగు

జాతీయస్థాయిలో సన్ నెం.1, ఈటీవీ కి 8వ రాంక్, టాప్ 10నుంచి వైదొలగిన జీ తెలుగు

భాషాభేదంగాని, వర్గీకరణగాని లేకుండా అన్ని చానల్స్ ప్రేక్షకాదరణ లెక్కింపులో ఈ ఏడాది నాలుగోవారానికి గాను బార్క్ వెల్లడించిన సమాచారం ప్రకారం సన్ టీవీ తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. నాలుగేళ్ళు పైబడిన పట్టణప్రాంత, గ్రామీణ ప్రేక్షకులను పరిగణనలోకి తీసుకొని ఈ డేటా లెక్కించారు. హిందీ జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్ స్టార్ ప్లస్ రెండో స్థానంలో ఉండగా, కలర్స్ మూడో స్థానానికి జారిపోయింది.

మరో ముఖ్యమైన విషయమేంటంటే, సోనీ పాల్, సోనీ మాక్స్ టాప్ టెన్ జాబితాలోకి వచ్చాయి. గతంలో టాప్ 10 లో ఉన్న స్టార్ గోల్డ్, జీ తెలుగు నిష్క్రమించాయి.  జీ టీవీ, జీ అన్మోల్ మాత్రం తమ నాలుగు, ఐదు స్థానాలు నిలబెట్టుకున్నాయి. స్టార్ ఉత్సవ్ ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానంలోకి రాగా సోనీ మాక్స్ ఏడో స్థానం సంపాదించుకుంది. ఈటీవీ ఎనిమిదో రాంకులో ఉండగా లైఫ్ ఓకే తొమ్మిదోస్థానం, సోనీ పాల్ పదో స్థానంలో ఉన్నాయి.