• Home »
  • Circulars »
  • దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ గా సుప్రియా సాహూ. ఆకాశవాణికి షెహర్యార్

దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ గా సుప్రియా సాహూ. ఆకాశవాణికి షెహర్యార్

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖలో  గతంలో జాయింట్ సెక్రెటరీగా పనిచేసిన సుప్రియా సాహూ దూరదర్శన్ కు పూర్తికాలపు డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు. అదే విధంగా ఆకాశవాణిలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న షెహర్యార్ ను డైరెక్టర్ జనరల్ గా పూర్తికాలపు నియామకాన్ని ధ్రువీకరించారు. ప్రసార భారతి బోర్డు 10మందిని ఇంటర్వ్యూ చేసినమీదట వీరిని నియమించింది. వారిలో ఆరుగురు ప్రసారభారతి నుంచి, ముగ్గురు ఐఐఎస్ నుంచిఒకరి ఐఎ ఎస్ నుంచి హాజరైనట్టు ప్రసారభారతి వర్గాలు తెలియజేశాయి.

ప్రసారభారతి బోర్డులో సభ్యులందరి నియామకం పూర్తయ్యేదాకా పూర్తికాలపు డైరెక్టర్ జనరల్ నియామకం జరగబోదని ప్రసార భారతి నిరుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఇన్ఫోసిన్ నిర్మాతలలో ఒకరైన వి. శశి శేఖర్ లాంఛనంగా ప్రసారభారతి సభ్యునిగా చేరటం, నటి కాజోల్ పేరు ఈ పాటికే ప్రకటించి ఉండటంతో మొత్తం బోర్డు నిర్మాణం పూర్తయినట్టయింది. ప్రసార భారతి చట్టం ప్రకారం చైర్మన్ తో బాటు ఆరుగురు పార్ట్ టైమ్ సభ్యులుండాలి.