• Home »
  • MIB/Licencing »
  • దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ గా సుప్రియా సాహు బాధ్యతల స్వీకారం

దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ గా సుప్రియా సాహు బాధ్యతల స్వీకారం

దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ గా సుప్రియాసాహు బాధ్యతలు చేపట్టారు. పూర్తి స్థాయిలో దూరదర్శన్ కు డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన త్రిపురారి శరన్ తన పదవీకాలం పూర్తి చేసుకొని రెండేళ్ళు గడిచింది. అప్పటినుంచి పూర్తికాలం డిజి నియామకం జరగలేదు. ఇప్పుడు ఆ పదవిలోకి వచ్చిమ సుప్రియా సాహు గతంలో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖలో  బ్రాడ్ కాస్టింగ్ విభాగం జాయింట్ సెక్రెటరీగా పనిచేశారు.

2016 ఫిబ్రవరి 24 న జరిగిన ప్రసార భారతి బోర్డు సమావేశం దూరదర్శన్ కు,  ఆకాశవాణికి డైరెక్టర్ జనరల్స్ ను ఎంచుకొని డిడి కి సుప్రియా సాహును, ఆకాశవాణికి షెహరియార్ ను మంత్రిత్వశాఖకు సిఫార్సు చేసింది. అప్పటికే డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ ఉన్న షెహరియార్ ఈ ఎంపిక అనంతరం మే 31 నాడు డిజి గా బాధ్యతలు చేపట్టారు.

సుప్రియా సాహు పదవీకాలం  సమాచార, ప్రసార మంత్రిత్వశాఖలో 2014 జూన్ తో పూర్తికాగా మూడు నెలల కొనసాగింపు, రెండు నెలల సెలవు తరువాత ఆమె తిరిగి తన తమిళనాడు కేడర్ కు వెళ్ళాల్సి ఉంది. అయితే, అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన మీదట ప్రసార భారతి  ఆమె విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీస్ నుంచి ఆరుగురిని, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ నుంచి ముగ్గురు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి ఒకరు ఇంటర్వ్యూకి హాజరయ్యారు.

 

ప్రసారభారతి బోర్డు మొత్తం ఏర్పడిన తరువాతనే ఇంటర్వ్యూలు చేసి డిజి లను నియమిస్తామని చెప్పినట్టే బోర్డు ఇంటర్వ్యూలు చేసింది. ఇద్దరు పార్ట్ టైమ్ సభ్యుల నియామకం జరగగానే బోర్డ్ పార్ట్ టైమ్ సభ్యుల నియామకం పూర్తయింది. ఇన్ఫోసిస్ ప్రధాన నిర్మాత అయిన శశి శేఖర్ వెంపత్తి వారిలో ఒకరు. ఇప్పుడాయన నీతి డిజిటల్ అనే ఆన్ లైన్ మీడియా కంపెనీ నడుపుతున్నారు. ఇక రెండో సభ్యులు బాలీవుడ్ నటి కాజల్.

 

ప్రసార భారతి చట్టం ప్రకారం బోర్డులో ఆరుగురు పార్ట్ టైమ్ సభ్యులుండాలి. దానికి చైర్మన్ నాయకత్వం వహిస్తారు. నిరుడు ఆరంభంలోనే ప్రసారభారతి చైర్మన్ ఈ నియామకాల విధానం గురించి చెప్పినట్టు ఇప్పుడు ఆచరించి చూపారు.