• Home »
  • National Channels »
  • టి20 వరల్డ్ కప్ స్పోర్ట్స్ చానల్స్ లో మాత్రమే : రూ.300 కోట్లు స్టార్ లక్ష్యం

టి20 వరల్డ్ కప్ స్పోర్ట్స్ చానల్స్ లో మాత్రమే : రూ.300 కోట్లు స్టార్ లక్ష్యం

ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ టి20 ప్రసారాలను కేవలం తన స్పోర్ట్స్ చానల్స్ కే పరిమితం చేయాలని స్టార్ ఇండియా నిర్ణయించింది.  గతంలో ప్రాంతీయ చానల్స్ లో కూడా ప్రసారం చేసినప్పటికీ  8 నుంచి చేసే ప్రసారాలు మాత్రం స్పోర్ట్స్ చానల్స్ ద్వారా మాత్రమే అందుతాయి. గతంలో మాత్రం ఏషియానెట్ మూవీస్, మా మూవీస్ , సువర్ణ తదితర ప్రాంతీయ చానల్స్ లో కూడా ప్రసారం చేశారు.

అయితే, మొదటిసారిగా భారత్ లో జరుగుతున్న ఈ టి20 వరల్డ్ కప్ ను మాత్రం స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 3 చానల్స్ లో ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రసారం చేస్తారు. వాటితోబాటే వాటి హై డెఫినిషన్ ( హెచ్ డి ) చానల్స్ అయిన స్టార్ స్పోర్ట్స్ హెచ్ డి 1, స్టార్ స్పోర్ట్స్ హెచ్ డి 3 లోనూ అందుతాయి. అదే విధంగా హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ కూడా చూసే అవకాశం ఉంటుంది.

చాలామంది ఎమ్మెస్వోలతో కుదుర్చుకున ఒప్పందాల ప్రకారం కనీసం రెండు స్పోర్ట్స్ చానల్స్ ను బేసిక్ పాకేజ్ లో ఇవ్వాల్సి ఉండటం వలన అత్యధికశాతం ప్రేక్షకులను చేరేందుకు అవకాశముందని భావిస్తున్నట్టు స్టార్ ఇండియా సీవోవో సంజయ్ గుప్తా చెప్పారు.  మొత్తం 10 జట్లు 35 మాచ్ లు ఆడతాయని, ఇప్పటికే 13 మంది స్పాన్సర్లు రావటం వలన కనీసం రూ. 300 కోట్ల రూపాయల ప్రకటనల ఆదాయం అంచనా వేశామని వెల్లడించారు.