• Home »
  • Broadband »
  • డిజిటల్ టెక్నాలజీతో డిటిహెచ్ తో పోటీ పడండి: కేబుల్ రంగానికి తలసాని పిలుపు

డిజిటల్ టెక్నాలజీతో డిటిహెచ్ తో పోటీ పడండి: కేబుల్ రంగానికి తలసాని పిలుపు

డిజిటైజేషన్ ను ఒక అనుకూల అవకాశంగా మార్చుకొని డిటిహెచ్ తో పోటీపడాలని కేబుల్ పరిశ్రమకు రాష్ట్ర వాణిజ్య పన్నులు, సినిమటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో మూడురోజుల సి ఎన్ సి ఎక్స్ పో ప్రారంభించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. సాంకేతికంగా ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను అవగాహన చేసుకుంటూ, సరికొత్త పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.

CNC4

ఎమ్మెస్వోలూ, కేబుల్ ఆపరేటర్లు ఐకమత్యంగా ముందుకు సాగాలని, పరిశ్రమ ఎదుగుదలకు కలసిమెలసి పనిచేసుకోవాలని పిలుపునిచ్చారు. లక్షలాదిమంది ఆధారపడిన కేబుల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వపరంగా జరగాల్సిన మేలు, అందాల్సిన సాయం అందేలా చూస్తానని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.

CNC3

తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య అధ్యక్షుడు, కేబుల్ సమాచారమ్ చీఫ్ ఎడిటర్ ఎం సుభాష్ రెడ్డి,  తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం నాయకులు శ్రీనివాస రెడ్డి, హరిగౌడ్, ఆంధ్రప్రదేశ్ కేబుల్ పరిశ్రమ ప్రతినిధులు కోనేరు మురళీకృష్ణ, కొల్లు శ్రీనివాసరావు, సూర్యనారాయణ తదితరులు ఈ ప్రారంభోత్సవ సమావేశంలో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

cnc2

సిఎన్ సి గ్రూప్, ఎసిటి డిజిటల్, కేబుల్ సమాచారమ్ ఆధ్వర్యంలో వరుసగా నాలుగో విడత జరుగుతున్న ఈ ప్రదర్శనలో అనే సంస్థలు తమ ఉత్పత్తులను, సర్వీసులను వివరించేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. డిజిటైజేషన్ నేపథ్యంలో డిజిటల్ హెడ్ ఎండ్స్ తయారీదారులు మొదలుకొని కేబుల్స్, స్ప్లైసింగ్ మెషిన్స్ తదితర అనేక పరికరాల తయారీదారులతోబాటు, హిట్స్ లాంటి సరికొత్త పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా వివరించేందుకు ఏర్పాట్లు చేయటంతో కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు స్వయంగా అన్ని విషయాలూ తెలుసుకోవటానికి ఉపయోగపడుతోంది.