• Home »
  • TAM »
  • నెం. 1 ’మా టీవీ ’ అంటున్న టామ్

నెం. 1 ’మా టీవీ ’ అంటున్న టామ్

టీవీ పరిశ్రమ పెట్టుకున్న రేటింగ్స్ సంస్థ బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ లెక్కలకూ టామ్ లెక్కలకూ పొంతన లేకుండా పోయింది. తాజా రేటింగ్స్ లో జీ తెలుగు నెంబర్ వన్ అని బార్క్ రేటింగ్స్ చెబుతూ ఉంటే టామ్ మాత్రం మా టీవీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ నెంబర్ వన్ స్థానంలోనే ఉన్నట్టు చెబుతోంది. దీంతో సహజంగానే పరిశ్రమలో ఒక అయోమయ వాతావరణం నెలకొంటున్నది.

టామ్ అందించిన సమాచారం ప్రకారం మా టీవీ 616 జీఆర్పీలతో నెంబర్ వన్ స్థానంలో ఉండగా జెమినీ 504 జీఆర్పీలతో రెండో స్థానంలో ఉంది. ఈటీవీ కూడా జీ తెలుగును దాటిపోయి 464 జీఆఅర్పీలతో మూడో స్థానంలోకి వెళ్ళగా జీ తెలుగు కేవలం 458 జీఆర్పీలతో నాలుగో స్థానంలో ఉంది.

ఈ రేటింగ్స్ లో చాలా విచిత్రంగా అనిపించేది ఏమిటంటే బార్క్ లో నెంబర్ వన్ అయిన జీ తెలుగు ఇక్కడ మాత్రం చిట్టచివరి స్థానం సంపాదించుకోవటం. మొత్తంగా చూస్తే ఎవరి రేటింగ్స్ ను నమ్మాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. తన చందా పునరుద్ధరించని చానల్స్ కు ర్యాంకు తగ్గించి ఇస్తున్నదన్న విమర్శలనుంచి టామ్ బయటపడే అవకాశాలు కనబడ్డం లేదు.