• Home »
  • BARC »
  • తమిళంలోనే టీవీ ప్రేక్షకులెక్కువ: ఉచిత టీవీ కారణమంటున్న సర్వే

తమిళంలోనే టీవీ ప్రేక్షకులెక్కువ: ఉచిత టీవీ కారణమంటున్న సర్వే

రెండు తెలుగు రాష్ట్రాలతో పోల్చినప్పుడు తమిళనాడు జనాభా తక్కువే. హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగే. కానీ టీవీ ప్రేక్షకుల సంఖ్యలో మాత్రం తమిళమే ముందుంటుంది. బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ లెక్కలు చెబుతున్న వాస్తవాలివే.

మొత్తం ప్రాంతీయ భాషలను పోల్చి చూసినప్పుడు తమిళ ప్రేక్షకుల వాటా 25.7 శాతం ఉండగా తెలుగు వాటా 24.4 శాతం. కన్నడ భాష వాటా 11.6 శాతం కాగామలయాళం (9.2 శాతం ), బెంగాలీ (6.6 శాతం), మరాఠీ (4.6 శాతం ) నమోదయ్యాయి. మిగిలిన ఒడియా, కశ్మీరీ, గుజరాతీ, భోజ్ పురి, అస్సామీ లాంటి భాషలన్నీ కలిపితే 17.9 శాతం వాటా దక్కించుకున్నాయి.

తమిళనాడులో అత్యధికంగా ప్రేక్షకుకుండటానికి కారణం ఉచిత టీవీలేనని తేలింది. గతంలో ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా పేదలందరికీ కలర్ టీవీలు ఇచ్చింది. ఆ సమయంలో టీవీ ఉన్నవాళ్ళు కూడా తీసుకున్నారు. దీంతో సగానికి పైగా ఇళ్ళలో రెండేసి టీవీలున్నాయి. అందుకే ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు రెండో టీవీని తమ వ్యాపార ప్రదేశంలోనే ఉంచుకోవటం కూదా ప్రేక్షకుల పెరుగుదలకు కారణమైంది.

సంఖ్య భాష ప్రేక్షకాదరణ వాటా
1 తమిళం 25.7
2 తెలుగు 24.4
3 కన్నడ 11.6
4 మలయాళం 9.2
5 బెంగాలీ 6.6
6 మరాఠీ 4.6
7 ఇతర భాషలు ( 3% లోపు వాటా)ఒడియా, కశ్మీరీ, గుజరాతీ, భోజ్ పురి, అస్సామీ తదితర భాషలు 17.9

Language wise channel share