• Home »
  • News »
  • పుదియ తలైమురై ’సైన్స్ టాలెంట్ హంట్’

పుదియ తలైమురై ’సైన్స్ టాలెంట్ హంట్’

PT veettukku oru

తమిళనాట్ ఎస్ ఆర్ ఎం విద్యా సంస్థల యాజమాన్యం ఆధ్వర్యంలో నడిచే నెంబర్ వన్ న్యూస్ చానల్ పుదియ తలైమురై (కొత్త తరం) 2015 సంవత్సరానికి సైన్స్ టాలెంట్ హంట్ కార్యక్రమం ప్రారంభించింది. విద్యార్థులలో ఉండే శాస్త్ర విజ్ఞాన తృష్ణను, సరికొత్త ఆవిష్కరణలకు దారితీసే ఆలోచనలను గుర్తించి ప్రోత్సహించేందుకు చానల్  నడుం బిగించింది. ఈ కార్యక్రమం పేరు వీట్టుక్కు ఒరు విజ్ఞాని ( ఇంటికో శాస్త్రవేత్త).

తమిళనాడు నలుమూలలా దాదాపు 25000 మంది విద్యార్థులతో అనుసంధానమయ్యేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సైన్స్ ఎగ్జిబిషన్ తరహాలో విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తారు. తమిళనాడులోని 32 జిల్లాలతో బాటు పాండిచ్చేరిలో ఈనెల 8 నుంచి ఎంపికలు సాగుతున్నాయి.  రెండు విభాగాలలో విజేతలను నిర్ణయిస్తారు. 6 నుంచి 8 వ తరగతి వరకు జూనియర్ విభాగం, 9 నుంచి 12వ తరగతి వరకు సీనియర్ విభాగం కింద లెక్కిస్తారు.

ఒక్కో జిల్లానుంచి ఎంపికైన విజేతను తిరుచ్చి లోని ఎన్ ఐ ఐటి కాంపస్ లో ఆగస్టు చివర్లో జరిగే గ్రాండ్ ఫినాలె కి ఆహ్వానిస్తారు. ఇద్దరేసి ఒక జట్టుగా పాల్గొనేందుకు వీలు కల్పిస్తారు. విజేతగా నిలిచిన జట్టుకు రూ.50 వేలు, రన్నరప్ జట్టుకు , రెండో రన్నరప్ కు రూ.15 వేలు ఇస్తారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని పుదియ తలైమురై చానల్ లో ప్రసారం చేస్తారు.