• Home »
  • DTH »
  • టాలీవుడ్ సహా 6 చానల్స్ కు టాటా స్కై నోటీస్

టాలీవుడ్ సహా 6 చానల్స్ కు టాటా స్కై నోటీస్

డిటిహెచ్ ఆపరేటర్ టాటా స్కై గడిచిన వారం రోజుల్లో రెండు విడతలుగా మూడేసి చానల్స్ చొప్పున మొత్తం ఆరు చానల్స్ కు నోటీసులు పంపింది. మూడు వారాల్లో స్పందించకపోతే వాటి ప్రసారాలు నిలిపివేస్తానని హెచ్చరించింది. వాటిలో రెండు తెలుగు చానల్స్ టాలీవుడ్, స్టుడియో వన్ ( ఆశీర్వాద్ గోల్డ్ ) ఉన్నాయి.

మూడవతేదీ జారీచేసిన నోటీసు బకాయిల చెల్లింపులకు సంబంధించినది. టాలీవుడ్, శ్రీ శంకర, ఎంబిసి టీవీ బకాయిలు చెల్లించలేదంటూ జులై 31 న నోటీసులు పంపింది. వాటికి మూడు వారాల సమయం ఇచ్చింది.

ఈ నెల 4న పంపిన నోటీసు చానల్స్ లో ఇండియా విజన్ న్యూస్, రిపోర్టర్ టీవీ, ఆశీర్వాద్ గోల్డ్ ( స్టుడియో వన్ హెచ్ డి ) ఉన్నాయి. ఒప్పంద నిబంధనలు ఉల్లంఘించినందుకు వీటిని తొలగిస్తున్నట్టు టాటా స్కై పేర్కొంది. ఆశీర్వాద్ గోల్డ్ నుంచి లీజుకు తీసుకొని స్టుడియో వన్ హెచ్ డి నడుస్తున్నందున నిబంధనలు ఉల్లంఘించినది ఎవరనే విషయం తెలియాల్సి ఉంది.