• Home »
  • Cable/DTH/HITS »
  • ఒ.టి.టి. కి సైతం ప్రసారాలు అందుబాటులో ఉండేలా టాటా స్కై సరికొత్త సెట్ టాప్ బాక్స్

ఒ.టి.టి. కి సైతం ప్రసారాలు అందుబాటులో ఉండేలా టాటా స్కై సరికొత్త సెట్ టాప్ బాక్స్

డిటిహెచ్ సంస్థ టాటా స్కై ఇప్పుడు సరికొత్త సెట్ టాప్ బాక్స్ అందిస్తోంది. దీని వలన కేవలం టీవీ సెట్ లోనే కాకుండా మొబైల్, ఐ పాడ్, టాబ్లెట్ లాంటి పరికరాలలో కూడా రికార్డ్ చేసిన టీవీ కార్యక్రమాలు చూడగలిగే వెసులుబాటు ఉంటుంది. తమ చేతుల్లో ఉన్న మొబైల్, ఐపాడ్, టాబ్లెట్ లలోకి నేరుగా డౌన్ లోడ్ చేసుకొని చూడటానికి వీలు కలుగుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ప్రీమియం సెట్ తాప్ బాక్సును రూపొందించింది.

వైఫై ద్వారా ఒకే ఇంట్లో నాలుగైదు ఇంటర్నెట్ కనెక్షన్లు పనిచేసినట్టే ఇది కూడా అనేక ప్లాట్ ఫామ్స్ మీద కార్యక్రమాలను చూడటానికి అవకాశం కల్పిస్తుంది. టాటా స్కై ప్లస్ ట్రాన్స్ ఫర్ పేరుతో తయారైన ఈ సెట్ టాప్ బాక్స్ ను కొత్త చందాదారులకు రూ. 9,300 చొప్పున ఇస్తుండగా ప్రస్తుతం ఉన్న చందాదారుల దగ్గర పర్సనల్ వీడియో రికార్డర్ బాక్సులు ఉంటే అదనంగా రూ. 7,200 చెల్లించి ఈ కొత్త బాక్స్ తీసుకునే వెసులుబాటు కల్పించింది.

ధనిక వర్గాలలో టీవీ చూడటంలో పట్ల ఒక భిన్నమైన ఆలోచన ఉంటుంది. 46% మేరకు టీవీ కార్యక్రమాలను సమయం మించిపోయిన తరువాతనో, మరో ఇతర పరికరంలోనో చూస్తారు. అందుకే ఈ తరహా సెట్ టాప్ బాక్స్ కు మంచి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే, అలా డౌన్ లోడ్ చేసుకున్న కార్యక్రమం 24 గంటలు మాత్రమే నిల్వ ఉంటుంది. ఆ తరువాత అదే చెరిగిపోతుంది. వై ఫై ద్వారా సెట్ టాప్ బాక్స్ నుంచి మొబైల్, టాబ్లెట్ లాంటి పరికరాలకు అందుతుంది.