• Home »
  • Uncategorized »
  • జైన్ హిట్స్ కు టిడిశాట్ మొట్టికాయ

జైన్ హిట్స్ కు టిడిశాట్ మొట్టికాయ

గురుకృప కేబుల్ నెట్ వర్క్ కు జైన్ హిట్స్ సిగ్నల్స్ నిలిపివేయటాన్ని టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పిల్లేట్ ట్రైబ్యునల్ (టిడిశాట్ ) తప్పుపట్టింది. నోయిడా సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ లిమిటెడ్ ( ఎన్ ఎస్ టి పి ఎల్ )సంస్థ ఆధ్వర్యంలో హెడ్ ఎండ్ ఇమ్ ద స్కై ( హిట్స్ ) నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సంస్థ తన పరిధిలోని ఎమ్మెస్వోకు సిగ్నల్స్ నిలిపివేయటం తగదని, వెంటనే సేవలు పునరుద్ధరించాలని ఆదేశించింది. అదే సమయంలో బకాయిల చెల్లింపుకు గురుకృప నెట్ వర్క్ కు మూడు వారాల గడువు కూదా ఇచ్చింది.

జైన్ హిట్స్ కు లక్ష రూపాయలకు పైగా బకాయిలున్నమాట నిజమే అయినా, అంతకుముంది ఎక్కువ చెల్లింపులు జరపటం వలన మొత్తం లెక్క చూసుకొని అసలైన బకాయి ఎంత ఉందో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని గురుకృప కేబుల్ నెట్ వర్క్ టిడిశాట్ కు తెలియజేసింది. వెకేషన్ బెంచ్ లొ కూర్చున్న టిడిశాట్ సభ్యుడు కుల్దీప్ సింగ్ ఆదేశాలు వెలువరిస్తూ సిగ్నల్స్ పునరుద్ధరించాలన్నారు. దీనిమీద వివరణ జైన్ హిట్స్ ఇచ్చుకోవచ్చునని, ఆగస్టు 12 న విచారణ చేపడతామని చెబుతూ ఈ లోపు ఇరువర్గాలూ రాజీపడటానికి అభ్యంతరం లేదని కూడా స్పష్టం చేశారు.

జైన్ హిట్స్ అందించే సిగ్నల్స్ కొన్ని సెట్ టాప్ బాక్సులలో రావటం లేదని గురు కృప సంస్థ ఫిర్యాదు చేయగా, జైన్ హిట్స్ ఆ వాదనను కొట్టిపారేసింది. చందాదారుల దరఖాస్తులు ఇవ్వనిచోట్ల అలా జరిగి ఉండవచ్చునని వాదించింది. ఏవైనా ఇంకా ఇవ్వాలసిన దరఖాస్తులు ఉంటే రెండువారాల్లొగా అందజేస్తామని గురుకృప ప్రతినిధి టిడిశాట్ లో తెలియజేశారు. ఈలోపు లెక్కలు సరిచూసుకోవాలని కూదా టిడిశాట్ ఇరుపక్షాలకూ సూచించింది.