• Home »
  • Cable »
  • కర్నాటక ఆపరేటర్ల వివాదం : మధ్యవర్తి సమక్షంలో పరిష్కారానికి టిడిశాట్ సూచన

కర్నాటక ఆపరేటర్ల వివాదం : మధ్యవర్తి సమక్షంలో పరిష్కారానికి టిడిశాట్ సూచన

కర్నాటక రాష్ట డిజిటల్ కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘం, సిటీ కేబుల్ నెట్ వర్క్ ఒక మధ్యవర్తి సమక్షంలో సమస్యను పరిష్కరించుకోవాలని టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పిల్లేట్ ట్రైబ్యునల్ (టిడిశాట్ ) ఆదేశించింది. ఖాతాలకు సంబంధించి, సెట్ టాప్ బాక్సుల నాణ్యతకు సంబంధించి వివాదాలు పరిష్కరించుకోవటానికి సెప్టెంబర్ 30 ని గడువు తేదీగా కూడా టిడిశాట్  నిర్ణయించింది.

ఈ వ్యవహారమంతా పూర్తయ్యేదాకా యథాతథ స్థితి కొనసాగించాలని టిడిశాట్ చైర్మన్ అఫ్తాబ్ ఆలం, సభ్యుడు కుల్దీప్ సింగ్ అదేశించారు.  మధ్యవర్తిత్వం సంతృప్తికరంగా లేని పక్షంలో ఇరుపక్షలాలో ఎవరైనా స్వేచ్ఛగా టిడిశాట్ దృష్టికి తీసుకురావచ్చునని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది.

269 మంది కేబుల్ ఆపరేటర్లకు ఈ కర్నాటక రాష్ట డిజిటల్ కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘం ప్రాతినిధ్యం వహిస్తోంది. సంఘం తరఫున న్యాయవాది నితిన్ భాటియా తన వాదనలు వినిపిస్తూ, సిటీ కేబుల్ అందజేసిన సెట్ టాప్ బాక్సులు అత్యంత దారుణమైన స్థితిలో ఉండటం వలన సిటీ కేబుల్ ప్రేక్షకులకు సిగ్నల్స్ బలహీనంగా వస్తున్నాయని చెప్పారు.
పిటిషన్ లో భాగమైన కేబుల్ ఆపరేటర్లు అందరూ కనెక్షన్ కు రూ.60  వంతున నెలనెలా చెల్లించటానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని కూడా టిడిశాట్ కు తెలియజేశారు. లెక్కలు సరిచూసుకొని బకాయిలు ఉంటే ఏ మాత్రం ఆలస్యం లేకుండా చెల్లిస్తామని చెప్పారు.ట్రాయ్ చెపినట్టుగా పాకే ఆధారిత ప్రసారాలకూ సిద్ధంగా ఉన్నామని కేబుల్ ఆపరేటర్లు తమ పిటిషన్ లో స్పష్టం చేశారు.

అయితే, కేబుల్ ఆపరేటర్ల సంఖ్య విషయంలో వివాదం నెలకొని ఉన్నట్టు సిటీ కేబుల్ తరఫు న్యాయవాది ఉపేందర్ ఠాకూర్ టిడిశాట్ దృష్టికి తెచ్చారు. వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో బకాయి పడ్డారని, ఏమైనప్పటికీ ట్రాయ్ మార్గదర్శకాలకు సిటీ కేబుల్ కట్టుబడి ఉంటుందని చెప్పారు. అయితే, ముందుగా ఒక మధ్యవర్తి సమక్షంలో వీలైనంత త్వరగా తేల్చుకోవటానికి ప్రయత్నించాలని టిడిశాట్ ఇరుపక్షాలకూ సూచించింది.