• Home »
  • Cable/DTH/HITS »
  • స్టార్ కు రూ. కోటి చెల్లించాలని జైన్ హిట్స్ కు టిడిశాట్ ఆదేశం

స్టార్ కు రూ. కోటి చెల్లించాలని జైన్ హిట్స్ కు టిడిశాట్ ఆదేశం

జైన్ హిట్స్ మాతృ సంస్థ నోయిడా సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ లిమిటెడ్ ( ఎన్ ఎస్ టి పి ఎల్ ) నెలరోజుల్లోగా స్తార్ ఇండియాకు కోటి రూపాయలు చెల్లించాలని టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పిల్లేట్ ట్రైబ్యునల్ ( టిడిశాట్ ) ఆదేశించింది. అదే సమయంలో స్టార్ ఇండియాను  సిగ్నల్స్ ఇవ్వటం నిలిపివేయవద్దని కూడా ఆదేశించింది.

స్టార్ ఇండియా అర్థంతరంగా తమకు సిగ్నల్స్ నిలిపి వేసిందంటూ ఎన్ ఎస్ టి పి ఎల్ ప్రతినిధులు టిడిశాట్ లో ఫిర్యాదు దాఖలు చేశారు. టిడిశాట్ చైర్మన్ జస్టిస్ అఫ్తాబ్ ఆలం, సభ్యులు కుల్దీప్ సింగ్, బిబి శ్రీవాస్తవ ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించారు.  బకాయిలుగా చెబుతున్న కోటి రూపాయలు ముందుగా చెల్లించాలని  ఎన్ ఎస్ టి పి ఎల్ ను,  సిగ్నల్స్ కొనసాగించాలని స్టార్ ఇండియాను ఆదేశించారు.

అయితే, తుది తీర్పుకు అనుగుణంగా ఈ చెల్లింపులలో  మార్పులు ఉంటాయని కూడా టిడిశాట్ స్పష్టం చేసింది. ఈ ఫిర్యాదును ఖండించదలచుకుంటే వారంలోగా అది కోర్టుకు సమర్పించాలని, రెండువారాల్లోగా దీనికి  సమాధానం ఇవ్వాలని టిడిశాట్ ఆదేశించింది. ఇలాంటి మరో పిటిషన్ ను కూడా కలిపి ఆగస్టు 7న విచారిస్తామని కోర్టు ప్రకటించింది.