• Home »
  • Cable »
  • ఇంటర్ కనెక్ట్ ఒప్పందాల పట్ల స్పష్టమైన వైఖరి ఉండాలి: ట్రాయ్ ని కోరిన టిడిశాట్

ఇంటర్ కనెక్ట్ ఒప్పందాల పట్ల స్పష్టమైన వైఖరి ఉండాలి: ట్రాయ్ ని కోరిన టిడిశాట్

పే చానల్ యజమానులు తమ చానల్స్ ని విడివిడిగాను, బొకే రూపంలోనూ ఇవ్వజూపుతున్న ధరలు ప్రకటించి ఎమ్మెస్వోలతో ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలు కుదుర్చుకోవాలన్న ట్రాయ్ నిబంధనలో స్పష్టత కానరావటం లేదని  టిడిశాట్ అభిప్రాయపడింది. ఎమ్మెస్వోలు మళ్ళీ చానల్స్ యజమానులతో బేరమాడుకోవటానికి అవకాశమిస్తున్నప్పుడు ధరలపట్టిక ప్రకటించటంలో అర్థమేంటని కూడా ట్రాయ్ ని ప్రశ్నించింది.  స్టార్ ఇండియాతోనూ, తాజ్ టెలివిజన్ తోనూ హిట్స్ సంస్థ ఎన్ ఎస్ టి పి ఎల్ కు ఏర్పడిన వివాదం నేపథ్యంలో  టిడిశాట్ ఈ విధంగా ట్రాయ్ ని హెచ్చరించింది.

రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ అనేది కేవలం రేట్లు చర్చించుకోవటానికి ప్రాతిదిక మాత్రమే అవుతుందా అనే విషయాన్ని  స్పష్టంగా తేల్చాలని టిడిశాట్ కోరింది. అదే నిజమైతే ఒక ఎమ్మెస్వోకూ మరో ఎమ్మెస్వోకూ ధర విషయంలో తేడాలుంటాయన్న విషయాన్ని కూడా స్పష్టంగా నిర్దేశించాల్సి ఉంటుంది.  పే చానల్స్ ఇచ్చే డిస్కౌంట్లు, ఇతర రాయితీలు తమ ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోవటానికి అవకాశమిస్తున్నామని కూడా ట్రాయ్ ఒప్పుకోవాల్సి ఉంటుందని టిడిశాట్ గుర్తుచేసింది. చర్చలు విఫలమైనప్పటికీ ఆర్ ఐ ఓ లో చెప్పినదే  గరిష్ఠ ధర అవుతుందన్న స్పష్టత కూడా ఇవ్వాలని టిడిశాట్ కోరింది.

ఇంటర్ కనెక్ట్ అగ్రిమెంట్ల విషయంలో హిట్స్ ఆపరేటర్ కూ, పే చానల్స్ కూ మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో తెలియజేయాలని ట్రాయ్ ని టిడిశాట్ కోరింది. హిట్స్ ను ఒక జాతీయ స్థాయి ఎమ్మెస్వో గా మాత్రమే చూస్తారా అనేది తెలియజేయాలని కోరింది. అదే నిజమైతే దాని ప్రభావం బ్రాడ్ కాస్టింగ్ రంగంమీద తీవ్రంగా ఉండే అవకాశముందని కూడా టిడిశాట్ అంచనా వేస్తోంది.