• Home »
  • Cable »
  • రూ.15 కోట్ల హాత్ వే బకాయిలపై MSM ఫిర్యాదు: తక్షణ చెల్లింపుకు టిడిశాట్ ఆదేశం

రూ.15 కోట్ల హాత్ వే బకాయిలపై MSM ఫిర్యాదు: తక్షణ చెల్లింపుకు టిడిశాట్ ఆదేశం

మల్టీ స్క్రీన్ మీడియా డిస్ట్రిబ్యూషన్ సంస్థకు బకాయి పడిన చందాల మొత్తం రూ. 14 కోట్ల 56 లక్షలు వెంటనే చెల్లించాలని టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పిల్లేట్ ట్రైబ్యునల్ (టిడిశాట్) హాత్ వే ను ఆదేశించింది. ఈ ఏడాది అక్టోబర్ 31లోగా మూడు వాయిదాలలో చెల్లించాలని చెప్పింది. మొదటి దశ, రెండో దశ డిజిటైజేషన్ జరిగే నగరాలకోసం  వేరువేరుగా ఎమ్ ఎస్ ఎమ్ తో హాత్ వే ఒప్పందాలు చేసుకుంది.

ఆరు నెలలుగా హాత్ వే తమకు డబ్బు చెల్లించలేదని, ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పేర్కొంటూ ఎమ్ ఎస్ ఎమ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ టిడిశాట్ కు ఫిర్యాదు చేసింది. మొదటి దశ చెల్లించకపోగా రెండో దశ రెన్యూ చేసుకోలేదని కూడా వివరించింది. అందుకే డబ్బు ఇప్పించాలని కోరింది.  ఫిర్యాదును పరిశీలించిన టిడిశాట్  హాత్ వే కు ఆదేశాలు జారీచేస్తూ వెంటనే చెల్లించాలని చెప్పింది.

ఒప్పందం ప్రకారం సిగ్నల్స్ ఇవ్వటం ఆపకుండా కొనసాగిస్తున్నామని, అయితే, డబ్బు రాకుండా ఎంతోకాలం వేచి ఉండలేకనే టిడిశాట్ కు వెళ్ళామని ఎమ్ ఎస్ ఎమ్ చెబుతోంది. హాత్ వే కి సిగ్నల్స్ ఆపేసే పక్షంలో దాదాపు 50 లక్షలకు పైగా ఇళ్ళకు సోనీ గ్రూప్ చానల్స్ ప్రసారాలు నిలిచిపోతాయని కూడా ఎమ్ ఎస్ ఎమ్ గుర్తుచేస్తోంది.