• Home »
  • Cable »
  • ఎమ్మెస్వో హెడ్ ఎండ్ తనిఖీకి 4 చానల్స్ ను అనుమతించిన టిడిశాట్

ఎమ్మెస్వో హెడ్ ఎండ్ తనిఖీకి 4 చానల్స్ ను అనుమతించిన టిడిశాట్

ఎమ్మెస్వోల డిజిటల్ హెడ్ ఎండ్స్ మీద అనుమానాలు మొదలయ్యాయి. కండిషనల్ యాక్సెస్ సిస్టమ్, ఎస్ ఎమ్ ఎస్ , సెట్ టాప్ బాక్స్ ఫీచర్లమీద పే చానల్స్ అభ్యంతరాలు వ్యక్తం చేయటం తరచు జరుగుతోంది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రసారభారతి ఇంజనీర్లను పంపి ఒకవైపు తనిఖీ చేయిస్తుండగా మరో వైపు బెసిల్ కూడా ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా హెడ్ ఎండ్ ఉన్నదీ లేనిదీ సరిచూస్తోంది.

అయితే, ఎంసి ట్రాన్స్ మిషన్స్ అనే ఎమ్మెస్వో ఏర్పాటు చేసిన హెడ్ ఎండ్ లో లోపాలున్నట్టు బెసిల్ గుర్తించగా నాలుగు చానల్స్ ఈ విషయంలో టిడిశాట్ కు వెళ్ళాయి. మళ్లీ బెసిల్ ను పంపటం ఆ ఎమ్మెస్వో మీద అదనంగా భారం మోపటమే అవుతుంది కాబట్టి  నాలుగు చానల్స్ ఉమ్మడిగా తమ సాంకేతిక బృందంతో తనిఖీ జరుపుకోవటానికి టిడిశాట్  అనుమతించింది.

మల్టీ స్క్రీమ్ మీడియా, స్టార్ ఇండియా, తాజ్ టెలివిజన్, ఇండియాకాస్ట్ యుటివి మీడియా డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ ఉమ్మడిగా తనిఖీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ సాంకేతిక బృందం వెళ్ళి అంతకుముందు బెసిల్ చెప్పిన తప్పిదం సవరించిందీ లేనిదీ తనిఖీ చేస్తుంది. ఈ కేసు విచారణను ఏప్రిల్ 8 న మళ్ళీ విచారిస్తామని టిడిశాట్ చైర్మన్ అఫ్తాబ్ అలమ్, సభ్యులు బిబి శ్రీవాస్తవ  ప్రకటించారు.