• Home »
  • Cable »
  • ’స్టార్’ చందాలు కట్టకండి: తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య పిలుపు

’స్టార్’ చందాలు కట్టకండి: తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య పిలుపు

ఎమ్మెస్వోల సమావేశం మళ్ళీ నిర్ణయం తీసుకునే వరకూ స్టార్ ఇండియా చాన్సల్స్ కు చందా బకాయిలు చెల్లించవద్దంటూ తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య పిలుపునిచ్చింది. సమాఖ్య అధ్యక్షుడు ఈ మేరకు తెలంగాణ లోని ఎమ్మెస్వోలందరికీ సమాచారం అందించారు. ఈ నెలాఖరులోపు సమావేశమై స్టార్ వ్యవహారం చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని మాత్రమే ఆ సమాచారంలో వెల్లడించారు.

స్టార్ ఇండియా వారి చానల్స్ ఫీడ్ ఇవ్వటంలో అక్రమంగా వ్యవహరిస్తూ ఎమ్మెస్వోల ఐక్యతను, వ్యాపారాన్ని దెబ్బతీసే చర్యలకు పూనుకోవటం వల్లనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఒక ఎమ్మెస్వో చెబుతున్నారు. తేదీ ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ ఈ నెలాఖరులోగా ఎమ్మెస్వోలు సమావేశమై ఇలాంటి సమస్యలు ముందు ముందు కూడా తలెత్తకుండా పే చానల్స్ అన్నిటికీ అల్టిమేటమ్ జారీచేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.