• Home »
  • Cable »
  • తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య మీద గ్రామీణ ఎమెస్వోల విమర్శనాస్త్రాలు

తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య మీద గ్రామీణ ఎమెస్వోల విమర్శనాస్త్రాలు

ఒకవైపు కార్పొరేట్ ఎమ్మెస్వోలను హెచ్చరిస్తూ, మరోవైపు స్థానిక ఎమ్మెస్వోలకు నచ్చజెబుతూ సాగిన తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య అధ్యక్షుని ఘాటైన లేఖకు సమాధానంగానే ఈ ప్రశ్నావళి సంధించినట్టు భావిస్తున్నారు. కార్పొరేట్ ఎమ్మెస్వోల చేతుల్లో కీలుబొమ్మలుగా మారవద్దంటూ సమాఖ్య అధ్యక్షుడు లేఖ రాయగా తెలంగాణ గ్రామీణ ప్రాంత ఎమ్మెస్వోల పేరుతో సోషల్ మీడియాలో ఈ ఎదురుదాడి మొదలైంది.

తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య అధ్యక్షుడు ఘాటైన పదజాలంతో కార్పొరేట్ ఎమ్మెస్వోలను దూషిస్తూ లేఖ రాయటం పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. డిజిటైజేషన్ కీలకదశలో ఉండగా వ్యాపారాన్ని సొంతం చేసుకోవటానికి ఎవరికి వారే తమవ్యూహాలతో ప్రచారం సాగిస్తున్న సమయంలో ఈ లేఖ రావటం ఊహించిందే అయినా ఆశించింది మాత్రం కాదని కొందరు గ్రామీణ ఎమ్మెస్వోలు వ్యాఖ్యానించారు.  సమాఖ్య అధ్యక్షుడు సుభాష్ రెడ్డి రాసిన లేఖ ఇది :

FB_IMG_1438962664780

ఇలా ఉండగా, దీనికి సమాధానంగానే అన్నట్టుగా తెలంగాణ గ్రామీణ ఎమ్మెస్వోలుగా చెప్పుకుంటూ “ మీరు పట్టించుకోని, మీ కంటికి కనిపించని బాధితులు “ గా తమను తాము అభివర్ణించుకుటూ కొంతమంది సోషల్ మీడియాలో ఆయనమీద ప్రశ్నాస్త్రాలు సంధించారు. యథాతథంగా ఇదీ వారి ప్రచారం :

ఫెఢరేషన్ ఆఫ్ తెలంగాణ ఎమ్మెస్వోస్ అధ్యక్షుల వారికి కొన్ని ప్రశ్నలు:

1) అయ్యా… అసలు ఎమ్మెస్వో లంటే ఎవరు?  తెలంగాణలో ఎంత మంది ఎమ్మెస్వోలు ఉన్నారు? అందులో ఎంతమంది మిమ్మల్ని ఓటువేసి ఎన్నుకున్నారు?

2) మీరు ప్రతిసారి నగరంలో ఏర్పాటు చేస్తున్న సమావేశము వలన ఎక్కువ ప్రయోజనము ఎవరు పొందుతున్నారు? మీరా… లేక ఇతర ఎమ్మెస్వోలా?

3) అసలు మీ వలన గ్రామీణప్రాంత ఎమ్మెస్వోలమైన మాకు కలిగిన ఒక్క ప్రయోజనమైనా చెబుతారా?

4) మీకు పట్టణప్రాంత MSO లు తప్ప గ్రామీణ ప్రాంత ఎమ్మెస్వో లను ఎప్పుడైనా గుర్తించిన పాపాన పోయారా?

5) తెలంగాణ లో  మీరు కార్పోరేట్ వ్యవస్థకు ఎంతమాత్రం తక్కువ?

6) నీ పరిధిలోని కేబుల్ ఆపరేటర్లను మీరు ఏవిదంగా ఇబ్బందులు పెట్టారో మీకు తెలియదా? 
7) జిల్లా విస్తరణలో కేబుల్ వేయడంలో ఆపరేటర్ల నుండి డబ్బులు వసూలు చేసి వారకి ఎలాంటి అధికారాలు లేకుండా చేయడం ఎంతవరకు న్యాయం?

8) బ్రాడ్ కాస్టర్లతో కుమ్ముక్కై గ్తామీణ కెబుల్ ఆపరేటర్లను, చిన్న ఎమ్మెస్వోలను ఇబ్బందుల పాలు చేసింది మరిచిపోయారా?

9) అసలు కార్పోరేట్ సంస్థలను గ్రామీణ ప్రాతాలలోకి ఉసికొల్పడం లో మీ, మీ పార్టనర్స్ పాత్ర ఏమీ లేదా?

11) మీరు కొత్తగా ఏర్పాటు చేస్తున్న DIGITAL HEADEND మాకు మేలు చేసేదే అయితే 30% వాటా మాట ఏంటి? అప్పుడు కాత్పోరేట్ సంస్థలకు మీకు తేడా ఏంటి?

11) అసలు MSO ల సమావేశం ఏర్పాటు చేసి స్వచ్వంగా ఎన్నికలు నిర్వహించగలరా? ఎందుకు ఇప్పటి వరకు జిల్లా మరియు మండల స్థాయి కమిటీలకు ఎన్నికలు నిర్వహించలేక పోతున్నారు?

12) మన తెలంగాణ జిల్లాల్లో జరుగుతున్న, జరిగే ఆపరేటర్ల, చిన్న ఎమ్మెస్వో ల సమాచారాన్ని  ఎందుకు మీ పత్రికలో ప్రచరించకుండా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పత్రికా స్వేచ్ఛకు బంగం కాదా?

13) ఇక తెలంగాణ చెట్టు పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్న మీరు మీ శుభోదయ డిజిటల్ ను ఆంద్రావారకి ఎందుకు అమ్మినట్టు? తరిగి అక్కడే ఇంకో దుకాణం తెరవడం వెనుక ఉన్న మతలబు ఏంటి?

ఇలా అడుక్కుంటూ పోతుంటే ప్పశ్నల పరంపర పేజీలు పేజీలు పెరగడమే తప్ప ఉపయోగం లేదు.

అందుకే చిన్న చిన్న ఆపరేటర్లను… వారి ఇష్ఠాను సారంగా స్వతంత్రంగా బ్రతకనీయండి. మీ చెప్పుచేతల్లోనే ఉండాలని అనుకోకండి.

వీలైతే ఈ ప్రశ్నలకు మీ కేబుల్ సమాచారంలో సమాదానాలివ్బండి.

ఇట్లు
మీరు పట్టించుకోని, మీ కంటికి కనిపించని బాదితులు.

 

ఇలా ఉండగా తెలంగాణ ఎమ్మెస్వోల సంఘం చేసిన ఘాటైన ఆరోపణలు, విమర్శలమీద కార్పొరేట్ ఎమ్మెస్వోలుగాని, వారి ప్రతినిధులుగాని ఇప్పటివరకూ  ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.