• Home »
  • Cable »
  • చీఫ్ సెక్రెటరీతో సుభాష్ రెడ్డి భేటీ : కేబుల్ పరిశ్రమ కోసం 3 వినతులు

చీఫ్ సెక్రెటరీతో సుభాష్ రెడ్డి భేటీ : కేబుల్ పరిశ్రమ కోసం 3 వినతులు

కేబుల్ టీవీ పరిశ్రమ భవిష్యత్తు కోసం ప్రభుత్వ సహకరించాలనికోరుతూ తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య అధ్యక్షుడు ఎం. సుభాష్ రెడ్డి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిసి మూడు వినతి పత్రాలు అందజేశారు. డిజిటైజేషన్ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కావాలో స్పష్టంగా పేర్కొంటూ ఈ వినతి పత్రాలు అందించారు.

నాలుగో దశ డిజిటైజేషన్ జరిగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సెట్ టాప్ బాక్స్ కొనుక్కోగలిగే స్థితిలో లేనందువల్ల ప్రభుత్వమే ఉచితంగా సెట్ టాప్ బాక్సులివ్వాలని సుభాష్ రెడ్డి ఒక వినతి పత్రంలో కోరారు. అదే విధంగా మూడో దశ డిజిటైజేషన్ గడువు మరో ఆరునెలలపాటు పొడిగించేలా కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ రాయాలని మరో వినతి పత్రంలో కోరారు.

ఎమ్మెస్వో వ్యవస్థ ఆర్థికంగా పుంజుకునేందుకు సహకరిస్తూ, ఎమ్మెస్వోలు నడిపే స్థానిక కేబుల్ చానల్స్ లో ప్రభుత్వ ప్రకటనలిచ్చి బలోపేతం చేయాలని కూడా ఇంకొక వినతి పత్రంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు శాటిలైట్ చానల్స్ కు మాత్రమే ప్రకటనలు ఇస్తుండగా ఈ విధానాన్ని స్థానిక చానల్స్ కు కూడా వర్తింపజేయాలని కోరారు.