• Home »
  • Cable »
  • హాత్ వే విస్తరణను అడ్డుకున్న తెలంగాణ ఎమ్మెస్వోలు

హాత్ వే విస్తరణను అడ్డుకున్న తెలంగాణ ఎమ్మెస్వోలు

హైదరాబాద్ తో బాటు మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో గణనీయంగా విస్తరించిన జాతీయ స్థాయి ఎమ్మెస్వో హాత్ వే వరంగల్ జిల్లాలో కొంతమంది ఆపరేటర్లకు సిగ్నల్స్ ఇవ్వటానికి ఒప్పుకొని సెట్ టాప్ బాక్సులు ఇస్తున్నట్టు తెలంగాణ ఎమ్మెస్వోలు ఆరోపిస్తున్నారు. కేబుల్ పరిశ్రమలో అనారోగ్యకరమైన ధోరణిని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

స్థానిక ఎమ్మెస్వోల వ్యాపారాన్ని దెబ్బతీస్తూ ఆపరేటర్లను ఇలా ప్రోత్సహించి ఫీడ్ ఇవ్వజూపటం తగదంటూ ఎమ్మెస్వోలు ఆందోళనకు దిగారు. నిరసన తెలియజేస్తూ ఎమ్మెస్వోలు ధర్నా జరపాలని కూడా నిర్ణయించుకుంది. అయితే, చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకునే క్రమంలో తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య అధ్యక్షుడు సుభాష్ రెడ్డి, హాత్ వే సీఈవో రాజశేఖర్ సమావేశమయ్యారు. చర్చల అనంతరం హాత్ వే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.