• Home »
  • Cable »
  • తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య లోగో విడుదల

తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య లోగో విడుదల

తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య అధ్యక్షుడు సుభాష్ రెడ్డి తమ సంస్థ లోగో విడుదలచేశారు. డిజిటైజేషన్ లో ఎమ్మెస్వోల పాత్ర కీలకంగా మారిన సమయంలో సంస్థ కార్యకాలాపాలు కూడా వేగం పుంజుకోవటంతో  లోగో అవసరమని భావించి దీన్ని రూపొందించినట్టు చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఎమ్మెస్వోస్ ( FTM ) ఇక మీదట ఈ లోగో ను వాడుకుంటుంది.  ఎమ్మెస్వోల సమాఖ్య కు నేరుగా సంబంధం లేకపోయినా, ఎమ్మెస్వోలకు లబ్ధి చేకూర్చేలా డిజిటల్ హెడ్ ఎండ్ ఏర్పాటు చేసి ఆమోదయోగ్యమైన పద్ధతిలో నిర్వహించటానికి సిద్ధమైనట్టు చెప్పారు.