• Home »
  • National Channels »
  • టాప్10 లో చోటు దక్కని తెలుగు చానల్స్: క్రికెట్ ప్రభావంతో స్టార్ స్పోర్ట్స్, డిడి కి స్థానం

టాప్10 లో చోటు దక్కని తెలుగు చానల్స్: క్రికెట్ ప్రభావంతో స్టార్ స్పోర్ట్స్, డిడి కి స్థానం

దేశవ్యాప్తంగా అత్యధిక ప్రేక్షకాదరణ ఉన్న చానల్ గా సన్ టీవీ తన తిరుగులేని ఆధిక్యాన్ని చాటుకుంటూనే వస్తోంది. హిందీ జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో నెంబర్ వన్ అనిపించుకునే స్టార్ ప్లస్ ఈ సారి కూడా నెంబర్ వన్ అయినప్పటికీ అన్ని భాషల్లో, అన్ని చానల్స్ తో కలిపి చూసినప్పుడుఈ సారి మూడో స్థానానికి దిగజారింది. కాకపోతే తన గ్రూప్ కే చెందిన స్టార్ స్పోర్ట్స్ 3 చానల్ కే రెండో స్థానం దక్కటం దానికి ఊరట.

ఐసిసి వరల్డ్ కప్ టి20 పోటీల సందర్భంగా ప్రేక్షకులు  ఆ ప్రసారాలకోసం టీవీలకు అతుక్కుపోవటం వల్లనే స్పోర్ట్స్ చానల్స్ కు విపరీతమైన ప్రేక్షకాదరణ లభించింది. రెండో స్థానంలో స్టార్ స్పోర్ట్స్ 3 చానల్ నిలవగా ఆరో స్థానంలో స్టార్ స్పోర్ట్స్ 1 నిలబడింది. డిడి మళ్ళీ 7 వ స్థానం ద్వారా టాప్ 10 లో నిలబడేందుకు క్రికెట్ ప్రసారాలే దోహదం చేశాయి. కలర్స్, జీ టీవీ నాలుగు ఐదు రాంకుల్లో ఉండగా జీ అన్మోల్, సోనీ పాల్, లైఫ్ ఓకే వరుసగా 8,9,10 స్థానాల్లో ఉన్నాయి. మొత్తం మీద తెలుగు చానల్స్ కు టాప్ 10 లో స్థానం దక్కలేదు.