• Home »
  • Audience »
  • సంక్రాంతి వారంలో రాంకుల తారుమారు

సంక్రాంతి వారంలో రాంకుల తారుమారు

జనవరి 13 నుంచి 19 వరకు సాగిన ఈ ఏడాది మూడో వారంలో తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్స్ రాంకులు తారుమారయ్యాయి. ప్రధానంగా సంక్రాంతి సినిమాలు సహా ప్రత్యేక కార్యక్రమాలే ఇందుకు కారణమని స్పష్టంగా తెలుస్తోంది. అంతకుముందు వారంతో  పోల్చుకున్నప్పుడు ఈటీవీ ప్రేక్షకాదరణ 5% తగ్గగా, జెమిని టీవీ 30%, స్టార్ మా 55%, జీ తెలుగు 15% పెరిగాయి.

అంతకుముందువారం మొదటి స్థానాన్ని కోల్పోయిన జెమినీ టీవీఈ సారి మళ్ళీ తన మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. చాలాకాలం తరువాత నెంబర్ వన్ స్థానంలోకి వచ్చిన ఈటీవీ ఈ సారి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. నాలుగో స్థానంలో ఉండిపోయిన స్టార్ మా ఇప్పుడు రెండో రాంకులోకి వచ్చింది. అంతకుముందువారం మూడో స్థానంలో ఉన్న జీ తెలుగు ఈ సారి నాలుగో రాంకుకు పడిపోయింది.

చానల్ వారంలో వీక్షణలు (వేలల్లో) రాంకు
జెమిని టీవీ 613230 1
స్టార్ మా 607410 2
ఈటీవీ తెలుగు 499167 3
జీ తెలుగు 483138 4