• Home »
  • International Channels »
  • ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ లీగ్ పోటీలకు యుబిఎ తో జతకట్టిన టెన్ స్పోర్ట్స్

ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ లీగ్ పోటీలకు యుబిఎ తో జతకట్టిన టెన్ స్పోర్ట్స్

టెన్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ లీగ్ పోటీలను అందించటానికి యునైటెడ్ బాస్కెట్ బాల్ అలయెన్స్ ( యుబిఎ) తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పోటీల మొదటి సీజన్ గత జులైలో హైదరాబాద్ లొ జరిగిన సంగతి తెలిసిందే. దేశం నలుమూలలనుంచి వచ్చిన బాస్కెట్ బాల్ ఆటగాళ్ళు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

ఐదు సీజన్ల లీగ్ ప్రసారాలకు తెన్ స్పోర్ట్స్ ఇప్పుడు యుబిఎ తో ఒప్పందం కుదుర్చుకుంది. రెండో సీజన్ లో 36 మాచ్ లు ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హెచ్ డి నాణ్యతతో చిత్రీకరించేందుకు ఈ రంగంలో నిష్ణాతులైన పౌల్ క్రేన్, విక్టర్ హోవెల్ రంగంలో దిగారు.

ఏప్రిల్ 1 నుంచి 3 వరకు హైదరాబాద్  గచ్చిబౌలి స్టేడియం లో ఫైనల్స్ జరుగుతాయి. బెంగళూరు బీస్ట్స్, చెన్నై స్లామ్, ఢిల్లీ కాపిటల్స్, హర్యానా గోల్డ్, హైదరాబాద్ స్కై, ముంబై చాలెంజర్స్, పూణె పేశ్వాస్, పంజాబ్ స్టీలర్స్… మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయి. టెన్ యాక్షన్, టెబ్ హెచ్ డు చానల్స్ లో సాయంత్రం 4.30 నుంచి 7.00 వరకు ఈ మాచ్ లు ప్రసారమవుతాయి.