• Home »
  • Channels »
  • టైమ్స్ నెట్ వర్క్ ఇంగ్లిష్ చానల్ MN+

టైమ్స్ నెట్ వర్క్ ఇంగ్లిష్ చానల్ MN+

టైమ్స్ నెట్ వర్క్ తాజాగా MN+ పేరుతో ఒక ఇంగ్లిష్ సినిమాల చానల్ ప్రారంభించింది. ఉన్నతశ్రేణి ప్రేక్షకులే లక్ష్యంగా అందిస్తున్న ఈ చానల్ లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన హాలీవుడ్ చిత్రాలతో బాటు విమర్శల మెప్పు పొందిన క్లాసిక్ చిత్రాలనూ అద్భుతమైన హెచ్ డి నాణ్యతతో ప్రసారం చేస్తామని యాజమాన్యం ప్రకటించింది. అది కేవలం ఇప్పుడు ప్రసారమవుతున్న మూవీస్ నౌ ఎస్ డి చానల్ కు పొడిగింపు మాత్రమే కాదని కూడా చెబుతోంది. చూడగానే దాని ప్రత్యేకత కనిపిస్తుందని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిదెంట్ వివేక శ్రీవాస్తవ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

హెచ్ డి లా మాత్రమే చాడాల్సిన సినిమాలన్నీ MN+  లో ప్రసారమవుతాయి. అంతర్జాతీయంగ అపేరు పొందిన, అందరి నోళ్ళలో నానే  సినిమాలకు ఇకమీదట ఈ చానల్ ఒక వేదిక అవుతుంది. ప్రేక్షకుడికి ప్రతి క్షణమూ విలువైనదిగా అనిపించటానికి ఈ చానల్ ఉపయోగపడుతుందని యాజమాన్యం చెబుతోంది. కేవలం అద్భుతమైన కంటెంట్ మాత్రమే అందించాలన్న చానల్ సిద్ధాంతానికి కట్టుబడి ఈ ప్రసారాలుంటాయని హామీ ఇస్తోంది. ఒకదానికొకటి  ప్రత్యామ్నాయంలా కాకుండా మూవీస్ నౌ, MN+ రెండూ అవసరమనే అభిప్రాయం కలిగిస్తాయని శ్రీవాస్తవ హామీ ఇస్తున్నారు.

అత్యుత్తమ చిత్రాలు మాత్రమే చూడాలనుకునే ఒక ప్రత్యేక వర్గం తమ టార్గెట్ ఆడియెన్స్ అని టైమ్స్ గ్రూప్ చెప్పుకుంటోంది. అందుబాటులో ఉన్న సమయాన్ని తెలివిగా, అర్థవంతంగా గడపాలనుకునే వాళ్ళకి వెంటనే ఈ చానల్ మాత్రమే గుర్తుకు రావాలన్నది తమ సిద్ధాంతమని కూడా చెబుతున్నారు. కొంతకాలంగా మూవీస్ నౌ రేటింగ్స్ పెరుగుతూ రావటమే ఇప్పుడు ఈ సరికొత్త చానల్ పుట్టుకను ప్రేరేపించిందని కూడా టైమ్స్ యాజమాన్యం చెబుతోంది. బార్క్ రేటింగ్స్ ప్రకారం సినిమా చానల్స్ లో26% మార్కెట్ వాటా మూవీస్ నౌ చానల్ ది.