• Home »
  • Audience »
  • రెండో వారంలోనూ మారని టాప్ 5 న్యూస్ చానల్స్ రాంకులు

రెండో వారంలోనూ మారని టాప్ 5 న్యూస్ చానల్స్ రాంకులు

జనవరి 6-12 తేదీల మధ్య సాగిన ఈ ఏడాది రెండో వారం ప్రేక్షకాదరణలోనూ టాప్ 5 న్యూ చానల్స్ రాంకులు మారలేదు. టీవీ 9 మొదటి స్థానంలో ఉండగా ఎన్టీవీ రెండో స్థానంలోను, టీవీ 5 మూడో స్థానంలోను ఉన్నాయి. ఆ తరువాత నాలుగు, ఐదు స్థానాల్లో ఎబి ఎన్ ఆంధ్రజ్యోతి, వి6 న్యూస్ ఉన్నాయి.

ఛానల్ 1 వ వారం వీక్షణలు రాంకు 2 వ వారం వీక్షణలు రాంకు
టీవీ9 52188 1 53427 1
ఎన్టీవీ 41893 2 41802 2
టీవీ 5 న్యూస్ 35934 3 36028 3
ఎబిఎన్ ఆంధ్ర జ్యోతి 34642 4 33886 4
వి 6 న్యూస్ 30557 5 30579 5

 

టీవీ9, టీవీ5 న్యూస్ కొద్దిగా పెరుగుదల నమోదు చేసుకోగా  ఎబిఎన్ ఆంధ్ర జ్యోతి, ఎన్టీవీ కొద్దిగా తగ్గాయి. వి6 న్యూస్ ఆదరణ స్థిరంగా ఉంది. మొత్తంగా రాంకులు మారకపోయినా ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 న్యూస్ కు మధ్య తేడా ఈ సారి కొంత పెరిగింది.