• Home »
  • Entertainment »
  • ఇప్పటిదాకా అనుమతి పొందిన శాటిలైట్ చానల్స్ 1023

ఇప్పటిదాకా అనుమతి పొందిన శాటిలైట్ చానల్స్ 1023

దేశంలో ప్రస్తుతం అనుమతి పొందిన చానల్స్ సంఖ్య 885. కానీ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఇప్పటివరకూ అనుమతించినమొత్తం చానల్స్ సంఖ్య మాత్రం 1023. ఈ తేడాకి కారణం కొన్ని చానల్స్ కి ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ రద్దు కావటం.  కొన్ని సందర్భాలలో ఆయా చానల్స్ యాజమాన్యాలు ఉపసంహరించుకోగా మరికొన్ని సందర్భాల్లో లైసెన్స్ వచ్చిన తరువాత వాటిని వాడుకోకపోవటం వలన ప్రభుత్వం రద్దు చేసింది. మరికొన్ని సందర్భాలలో డైరెక్టర్లకు సెక్యూరిటీ క్లియరెస్న్ లేకపోవటంతో రద్దయ్యాయి.

తాజా లెక్కల ప్రకారం ఇలా రద్దయిన లైసెన్సులు పోను  ఏప్రిల్ 30 నాటికి లైసెన్స్ ఉన్న  చానల్స్ సంఖ్య 885. వీటిలో  న్యూస్ చానల్స్ సంఖ్య 401.  మిగిలిన నాన్-న్యూస్ చానల్స్ 484.  మొత్తం 885 చానల్స్ ను మరో రకంగా వర్గీకరించినప్పుడు భారతదేశం నుంచి అప్ లింక్ అయ్యే చానల్స్ సంఖ్య 789. కానీ వాటిలో 20 చానల్స్ భారతదేశంలో డౌన్ లింక్ కావు. అంటే విదేశాలకోసం భారతదేశం నుంచి అప్ లింక్ అవుతున్నాయి. వాటిని మనమిక్కడ చూడలేం.  వాటిలో 7 న్యూస్ చానల్స్ కాగా 13 నాన్-న్యూస్ చానల్స్ .

అదే సమయంలో  విదేశాలలో అప్ లింక్ అవుతూ భారతదేశంలో డౌన్ లింక్ మాత్రమే అయ్యే చానల్స్ సంఖ్య 96. అంటే భారతప్రభుత్వం నుంచి డౌన్ లింకింగ్ లైసెన్స్ మాత్రమే తీసుకొని ఇక్కడ ప్రసారాలు చేస్తున్నచానల్స్ . వాటిలో 15 న్యూస్ చానల్స్ కాగా 81 నాన్-న్యూస్ చానల్స్.భారత్ నుంచి అప్ లింక్ అవుతూ భారత్ లో మాత్రమే డౌన్ లింక్ అయ్యే 769 చానల్స్ లో 379 న్యూస్ చానల్స్, 390 నాన్-న్యూస్ చానల్స్.