• Home »
  • Cable »
  • బ్రాడ్ కాస్టింగ్, కేబుల్ సర్వీసులమీద ట్రాయ్ కరదీపిక

బ్రాడ్ కాస్టింగ్, కేబుల్ సర్వీసులమీద ట్రాయ్ కరదీపిక

వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఒక కరదీపిక ప్రచురించింది. మూడో దశ డిజిటైజేషన్ పూర్తి కావటానికి ఇంకా ఐదు నెలల సమయమే మిగిలి ఉన్న ఈ సమయంలో వినియీగదారులకు ఎదురయ్యే అనేక అనుమానాలకు సమాధానం తెలిసేలా ఈ పుస్తకాన్ని ట్రాయ్ రూపొందించింది. తరచు వస్తున్న ప్రశ్నలకు ఇందులో సమాధానాలున్నాయని పేర్కొంది.

టీవీ వినియోగదారులను, వినియీగదారుల సంఘాలను చైతన్యవంతులను చేయటంతోబాటు వారి ప్రయోజనాలను కాపాడటమే ధ్యేయగా దీన్ని అందిస్తున్నట్టు ట్రాయ్ పేర్కొంది.  ట్రాయ్ ఎప్పటికప్పుడు జారెచేసిన నిబంధనలను కొదా ఇందులో పొందుపరచారు. చానల్స్ కు సంబంధించిన నిబంధనలతో బాటు కేబుల్ రంగానికి సంబంధించి వినియోగదారులు తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. సులభంగా అర్థమయ్యే విధంగా ఎక్కువ సమాచారాన్ని జోడించారు.

డిజిటైజేషన్, సెట్ టాప్ బాక్స్ కొనుగోలు, మార్పిడి, చానల్స్ ఎంపిక, బిల్లు చెల్లించే విధానం, పే చానల్స్, ఫిర్యాదు చేసే పద్ధతి, బిల్లింగ్ తదితర అంశాలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. వినియీగదారులలో చైతన్యం నింపటాన్ని బాధ్యతగా భావించి ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దామని ట్రాయ్ ఒక ప్రకటనలో పేర్కొంది.