• Home »
  • Cable »
  • చర్చాపత్రంమీద స్పందనకు గడువు పెంచిన ట్రాయ్

చర్చాపత్రంమీద స్పందనకు గడువు పెంచిన ట్రాయ్

అడ్రెసిబుల్ సిస్టమ్స్ ద్వారా టీవీ చానల్స్ పంపిణీ చేసే సంస్థల ఇంటర్ కనెక్షన్ రూపకల్పన మీద టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) జారీ చేసిన చర్చాపత్రం మీద స్పందనకు గడువు పొడిగించింది. ఎక్కువమంది తమ స్పందనలు పంపటానికి వీలుగా ట్రాయ్ ఈ వెసులుబాటు కల్పించింది. ఈ చర్చాపత్రం విడుదల చేసినప్పుడు జూన్ 3 ను అభిప్రాయాలు తెలియజేయటానికి గడువు తేదీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, మరో వారం రోజుల అదనపు సమయం కేటాయిస్తూ గడువు తేదీని జూన్ 10 కి పొడిగించింది.
అయితే ఆ అభిప్రాయాలమీద వ్యాఖ్యానించటానికి, ప్రతిస్పందించటానికి నిర్దేశించిన జూన్ 17 గడువు విషయంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదని ట్రాయ్ ప్రకటించింది. ఈ చర్చా పత్రం ప్రధానంగా సర్వీస్ ప్రొవైడర్లలో నమ్మకం పెంచటానికి, వ్యాపారం చేసుకోవటంలో సరళత్వం పెంచటానికి, వివాదాలు తగ్గించటానికి, పారదర్శకతను, సమర్థతను, పోటీతత్వాన్ని పెంచటానికి, ఒక క్రమపద్ధతిలో ఎదుగుదల సాధించటానికి దోహదం చేయటం, తద్వారా చందాదారులకు చాయిస్ పెంచటానికి దారితీయటం మీద దృష్టి సారిస్తుంది.