• Home »
  • Cable »
  • ఇంటర్ కనెక్ట్ ఒప్పందాల రిజిస్టర్ పై ట్రాయ్ నిబంధనల రూపకల్పన

ఇంటర్ కనెక్ట్ ఒప్పందాల రిజిస్టర్ పై ట్రాయ్ నిబంధనల రూపకల్పన

ఎమ్మెస్వోలకు, బ్రాడ్ కాస్టర్లకూ మధ్య ఎలాంటి ఒప్పందాలు ఏ నమూనాలో ఉండాలి, ఎమ్మెస్వోలు, ఆపరేటర్లకు మధ్య ఒప్పందాల నమూనాలు ఎలా ఉండాలి అనే విషయాల మీద టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) ముసాయిదా నమూనాలు విడుదలచేసింది. అదే విధంగా డిటిహెచ్ ఆపరేటర్లు, హిట్స్ ఆపరేటర్లు, ఐపిటివీ సర్వీస్ ప్రొవైడర్లు పాటించాల్సిన విధానాలను కూడా పట్టికల రూపంలో పొందుపరచింది.

ఈ నమూనాల మీద సూచనలు, సలహాలు, అభ్యంతరాలు ఉంటే ఏప్రిల్ 25 లోగా తెలియజేయాలని కోరింది. ఈ వ్యాఖ్యలన్నిటినీ వెబ్ సైట్ లో ఉంచి వాటిమీద ప్రతిస్పందనకు మే 5 వ తేదీ వరకు అవకాశం కల్పిస్తోంది.

ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారుచేసుకోకుండా ఒక నిర్దిష్టమైన విధానం పాటించటం ద్వారా భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూడాలన్నదే ట్రాయ్ తన లక్ష్యమని చెప్పుకుంది. మార్కెట్ లొ ఉన్న అలవాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించటానికి కూడా ఇలాంటి ఏకరూపత అవసరమని ట్రాయ్ భావిస్తోంది.

ఇందులో షెడ్యూల్ 1 లో బ్రాడ్ కాస్టర్లకు, చానల్ పంపిణీదారులకు మధ్య జరగాల్సిన ఒప్పందాలకు సంబంధించిన నమూనా ఉంది. షెడ్యూల్ 2 లో ఎమ్మెస్వోలు లేదా హిట్స్ ఆపరేటర్లు  ఆయా పే చానల్స్ బ్రాడ్ కాస్టర్లతో చేసుకునే ఒప్పందం గురించి ఉండగాషెడ్యూల్ 3 లో డిటిహెచ్ ఆపరేటర్లు, ఐపిటీవీ సర్వీస్ ప్రొవైడర్లు చేసుకోవాల్సిన పే చానల్స్ ఒప్పందాల గురించి ఉంది.

అందరూ పూర్తిగా వాస్తవ సమాచారాన్ని ఇవవలంటే ఇలాంటి ఏకరూప నమూనాలను పాటించటం తప్పనిసరి అని ట్రాయ్ భావిస్తోంది.  వ్యాపారపరమైన వివరాలన్నీ ఇలా  పొందుపరచి ట్రాయ్ కి సమర్పించటం వలన పారదర్శకత ఉంటుందని, బ్రాడ్ కాస్టర్లు ఒక ఎమ్మెస్వోకు, మరో ఎమ్మెస్వోకు మధ్య వివక్ష ప్రదర్శించే అవకాశం ఉండదని ట్రాయ్ అభిప్రాయపడుతోంది. కారేజ్ ఫీజు విషయంలోనూ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొ విధంగా వసూలు చేస్తుంటే ఆ విషయం కూడా బయటపడుతుంది.

అయితే, ట్రాయ్ ఈ సమాచారం మొత్తాన్ని తన వెబ్ సైట్ లో ఉంచి అందరూ చూడగలిగేలా అవకాశమిస్తే తప్ప ప్రయోజనం ఉండకపోవచ్చునని వాదిస్తున్నవారున్నారు. అదే సమయంలో వ్యాపార రహస్యాలను వీధికెక్కించటం సమంజసం కాదనే వాదన కూదా వినిపిస్తోంది. వ్యాపారంలో పోతీదారులకు తెలియటం వరకు పారదర్శకత సమంజసమే అయినప్పటికీ చందాదారులందరికీ తెలియటం మంచిది కాదన్న అభిప్రాయమూ ఉంది. అందువలన ఈ చర్చాపత్రం మీద అ భిప్రాయాలు, వాటి మీద ప్రతిస్పందన చూసిన మీదట ట్రాయ్ తీసుకోబోయే నిర్ణయం అత్యంత కీలకంగా మారబోతోంది.

 

ట్రాయ్ ప్రతిపాదించిన నమూనాలు ఈ విధంగా ఉన్నాయి :

షెడ్యూల్ – I

పే చానల్ బ్రాడ్ కాస్టర్ నమూనా

పే చానల్ అందించే బ్రాడ్ కాస్టర్ కు, చానల్ సిగ్నల్స్ పంపిణీ దారు ( ఎమ్మెస్వో ) కు మధ్య ఇంటర్ కనెక్ట్ ఒప్పందానికి సంబంధించిన సమాచారం

పార్ట్ – ఎ

బ్రాడ్ కాస్టర్ పేరు : ………………………………………………….   నెల :  ……………………………..

ఆధరైజేషన్ పొందిన  వ్యక్తి పేరు, చిరునామా,

సంప్రదించాల్సిన ఫోన్, మెయిల్ తదితర వివరాలు:

టేబుల్ – ఎ1 పంపిణీ వేదిక తరహా : ………………….

( ఎమ్మెస్వో/డిటిహెచ్/హిట్స్/ఐపిటీవీ ఒక్కో తరహాకు వేరు వేరుగా షీట్లలో రాసి అందించాలి

బ్రాడ్ కాస్టర్ ఒప్పందం సంతకం చేసిన పంపిణీ దారు పేరు పంపిణీదారు రిజిస్ట్రేషన్/లైసెన్స్  నెంబర్ ఒప్పందం సంఖ్య # ఒప్పందం ఏయే ప్రాంతాలకు* చేశారో వాటి పేర్లు ఒప్పందం సంతకం చేసిన తేదీ ఒప్పందం అమలులో ఉండే కాలవ్యవధి
          ఆరంభం ముగింపు
1 2 3 4 5 6 7
             

 

# పార్ట్ బి లో 1వ కాలమ్ చూడవచ్చు

*డిటిహెచ్ లేదా హిట్స్ విషయంలో ఇది భారతదేశం మొత్తం అవుతుంది.

 

 

టేబుల్ ఎ-2

బొకే కోడ్ ఇవ్వజూపుతున్న బొకే పేరు ( ఉంటే ) ఆ బొకే లో ఉండే చానల్స్ పేర్లు ఆ చానల్ డౌన్ లింకింగ్ లైసెన్స్ పొందిన బ్రాడ్ కాస్టర్ పేరు
1 2 3 4
       

 

గమనిక :  ఒకటికంటే ఎక్కువ చానల్స్ కు డబ్బు ముట్టిన  ఏ ప్రతిపాదన/ఒప్పందం అయినా సరే బొకే గా పిలవబడుతుంది.  ఒకవేళ ప్రత్యేకంగా ఒక పేరు పెట్టకపోయినా, అందుబాటులో ఉన్న అన్ని చానల్స్ ఇస్తూ ఉంటే  దాన్ని ఫుల్ బొకే అని పిలవ వచ్చు.

  1. బొకే కోడ్
           
పే చానల్ బ్రాడ్ కాస్టర్ కోడ్   బొకే నెంబర్

 

పార్ట్ – బి             

బ్రాడ్ కాస్టర్ కు, టీవీ చానల్ పంపిణీ దారుకు మధ్య జరిగే ఇంటర్ కనెక్ట్ ఒప్పందానికి సంబంధించిన వ్యాపార సమాచారం

బ్రాడ్ కాస్టర్ పేరు : ………………………………………………….   నెల :  ……………………………..

ఆధరైజేషన్ పొందిన  వ్యక్తి పేరు, చిరునామా,

సంప్రదించాల్సిన ఫోన్, మెయిల్ తదితర వివరాలు:

టేబుల్-బి ( ఎమ్మెస్వో/డిటిహెచ్/హిట్స్/ఐపిటీవీ ఒక్కో తరహాకు వేరు వేరుగా షీట్లలో రాసి అందించాలి )

ఒప్పందం సంఖ్య అ లా కార్టే / బొకే ఇవ్వజూపే చానల్స్

అ లా కార్టే /బొకే

ఆర్ ఐ ఒ ధర

అ లా కార్టే /బొకే

అ లా కార్టే /బొకే లో ఒప్పికున్న చందా ధర చందాధర యూనిట్ చందా ధరలో డిస్కౌంట్ రూ. వివరణ
        స్థిర చర స్థిర చర స్థిర చర  
1 2 3 4 5 6 7 8 9 10 11
                     

పై వివరాలన్నీ ఎక్సెల్ షీట్ లో సమర్పించాలి.

డిజిటల్ విధానంలో సంతకంచేసిన ఒక్కో ఒప్పందం కాపీని ట్రాయ్ కి పంపాలి. అలా పిడిఏఫ్ చేసిన పైల్ నేమ్ గా  ఒప్పందం నెంబర్ నే వాడాలి.

గమనిక:

కాలమ్1. ప్రతి ఇంటర్ కనెక్ట్ ఒప్పందానికి ఈ దిగువ సూచించిన పద్ధతిలో ఒక  నెంబర్ కేటాయించాలి.

                         
పే చానల్ యజమాని పేరు పంపిణీ దారు తరహా ఒప్పందమైన సంవత్సరం ఒప్పందం ప్రత్యేక సంఖ్య

 

పే చానల్ యజమాని పేరును ట్రాయ్ ఆదేశాల రూపంలో తెలియజేస్తుంది

కాలమ్ 2: కేవలం అ లా కార్టే లేదా బొకే అని మాత్రమే వాడాలి. మరే ఇతర పేర్లూ అనుమతించబడవు.

కాలమ్ 3: అ లా కార్టే లో ఇస్తుంటే ఆ చానల్ పేరు పేర్కొనాలి. బొకే పద్ధతిలో ఇస్తూ ఉంటే, ఆ బొకే పేరు రాయాలి.

కాలమ్ 4:  అ లా కార్టే పద్ధతిలో ఒక్కో చానల్ కు, బొకే అయితే ఆ బొకేకి ఎంత ఆర్ ఐ ఒ ధర ప్రకటించారో  అది రాయాలి

కాలమ్ 5: ఈ కాలమ్ లో అంకెలు రాసేటప్పుడు గమనించాల్సిన విషయమేమిటంటే డిజిటైజేషన్ లో ఫిక్సెడ్ (స్థిర) ఫీజును  మినిమమ్ గ్యారెంటీగా పరిగణించటం నిషిద్ధం.

కాలమ్ 6: మారే ( చర ) ఫీజును రూపాయలలో సూచిస్తూ వాటికి తగిన యూనిట్లని కాలమ్ 8 లో ఎంచుకోవాలి

కాలమ్ 7,8: యూనిట్లను ఒక నెలకు లేదా ఒక చందాదారుకు అని పేర్కొనాలి

కాలమ్ 9,10: ఆర్ ఐ ఒ ధర మీద డిస్కౌంట్ లెక్కింపు జరుగుతుంది. ఉదాహరణకు ఒక చానల్ అ లా కార్టే ధర ఆర్ ఐ ఒ ప్రకారం రూ. 10 అయినప్పుడు దానిని రూ.7 కు ఇస్తే, అప్పుడు డిస్కౌంట్ రూ. 3 అవుతుంది. అదే విధంగా 5 చానల్స్ ఉన్న ఒక బొకే లో వాటి అ లా కార్టే ధరలు రూ. 10,15,20,25,30 ఉన్నాయనుకుందాం. వాటిని బొకే గా కలిపి మొత్తం రూ. 30 కి ఇవ్వజూపితే, అప్పుడు డిస్కౌంట్ రూ. 70 అవుతుంది.

కాలమ్ 11: అవసరమనిపించినచోట వివరణలు ఇవ్వండి.

 

 

                          షెడ్యూల్ – II

               ఎమ్మెస్వో, హిట్స్ పంపిణీదారు నమూనా

ఎమ్మెస్వో లేదా హిట్స్ పంపిణీదారుడి నెట్ వర్క్ సేవలు అందుకునేందుకు స్థానిక కేబుల్ ఆపరేటర్ (LCO/LMO) తో ఎమ్మెస్వో లేదా హిట్స్ పంపిణీదారుడు చేసుకునే ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలకు సంబంధించిన సమాచారం

పార్ట్ – ఎ

ఎంఐబి లో నమోదైన /లైసెన్స్ లో పేర్కొన్న విధంగా పేరు :

తరహా (రకం) :    ………….  ( MSO/HITS )                     నెల :   …………….

ఆధరైజేషన్ పొందిన  వ్యక్తి పేరు, చిరునామా,

సంప్రదించాల్సిన ఫోన్, మెయిల్ తదితర వివరాలు:

టేబుల్- ఎ 1 : స్థానిక కేబుల్ ఆపరేటర్ తో ఎమ్మెస్వో లేదా హిట్స్ పంపిణీదారు ఇంటర్ కనెక్షన్ వివరాలు

ఎమ్మెస్వో/ హిట్స్  పంపిణీ దారు ఒప్పందం సంతకం చేసిన ఆపరేటర్ పేరు కేబుల్ ఆపరేటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒప్పందం సంఖ్య # ఒప్పందం ఏయే ప్రాంతాలకు* చేశారో వాటి పేర్లు ఒప్పందం సంతకం చేసిన తేదీ ఒప్పందం అమలులో ఉండే కాలవ్యవధి
          ఆరంభం ముగింపు
1 2 3 4 5 6 7
             

గమనిక :  పార్ట్ బి 1 లోని కాలమ్1 పరిశీలించాలి

 

 

 

 

పార్ట్ – బి

ఎమ్మెస్వోకు, స్థానిక కేబుల్ ఆపరేటర్ కు లేదా హిత్స్ పంపిణీదారుకు, స్థానిక కేబుల్ ఆపరేటర్ కు మధ్య జరిగిన ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలకు సంబంధించిన సమాచారం

ఎంఐబి లో రిజిస్టర్ అయిన/లైసెన్స్ పొందిన  పేరు :

తరహా/రకం : ………………………..  ( MSO/HITS )                         నెల : ……………………..

ఆధరైజేషన్ పొందిన  వ్యక్తి పేరు, చిరునామా,

సంప్రదించాల్సిన ఫోన్, మెయిల్ తదితర వివరాలు:

 

టేబుల్ బి1: ఎమ్మెస్వో లేదా హిట్స్ పంపిణీదారుకు, స్థానిక కేబుల్ ఆపరేటర్ కు మధ్య ఆదాయపంపిణీ ఏర్పాటు

ఒప్పందం సంఖ్య అపరేటర్ తో ఆదాయ పంపిణీ వాటా ఆదాయ పంపిణీ కి యూనిట్ వివరణలు
1 2 3 4
       

డిజిటల్ పద్ధతిలో సంతకం చేసి ప్రతి ఒప్పందానీ ట్రాయ్ కి పంపాలి. అలా పిడిఎ చేసిన డాక్యుమెంట్ కి ఇచ్చే ఫైల్ నేమ్ ఆ ఒప్పందం సంఖ్య అయి ఉండాలి.

గమనిక :

  • ఒప్పందం సంఖ్య ఎలా ఇవ్వాలనే నమూనాను విడిగా మరో ఆదేశం ద్వారా తెలియజేయబడుతుంది.
  • ఈ కాలమ్ లో ఎమ్మెస్వో తన వాటా చెప్పాలి. ఒకవేళ నెలసరి చందా కు, కారేజ్ ఫీజుకు, ప్లేస్ మెంట్ ఫీజుకు ప్రత్యేకమైన ఏర్పాటు ఉండే పక్షంలో అక్కడే విడివిడిగా తెలియజేయాలి. స్థానిక కేబుల్ ఆపరేతర్ నుంచి బేసిస్ సర్వీస్ టైర్ కి, పే చానల్స్ బొకేకి,  ఉచిత చానల్స్ తో కూడిన బొకేకి వేరు వేరుగా ధరలు నిర్ణయించిన పక్షంలో ఆ విషయాన్నే  పట్టికలో మరిన్ని విభాగాలు ఏర్పాటు చేసి వివరణ కాలమ్ లో పేర్కొనాలి.
  • యూనిట్ అనేది ఏక మొత్తంగా అని గాని, ఒక్కో చందాదారుకు అని గాని ఉండవచ్చు.

 

పట్టిక బి2 – ఎమ్మెస్వో లేదా హిట్స్ ఆపరేటర్ కు బ్రాడ్ కాస్టర్ తో ఆదాయ పంపిణీ ఏర్పాటు

ఒప్పందం సంఖ్య కారేజ్ ఫీజుకు ఒప్పుకున్న

బ్రాడ్ కాస్టర్

ఒప్పుకున్న కారేజ్ ఫీజు (రూపాయల్లో) కారేజ్ ఫీజుకు యూనిట్ బ్రాడ్ కాస్టర్ తో ఒప్పుకున్న మరేదైనా ఫీజు వివరణలు
1 2 3 4 5 6 7 8
               

 

 

                                          షెడ్యూల్ III

                     డిటిహెచ్, ఐపిటివి సర్వీస్ ప్రొవైడర్ నమూనా

పే చానల్ ను చందాదారుకు అందించేలా బ్రాడ్ కాస్టర్ తో డిటిహెచ్ ఆపరేటర్ లేదా ఐపిటివి సర్వీస్ ప్రొవైడర్ కుదుర్చుకునే ఇంటర్ కనెక్ట్ ఒప్పందానికి సంబంధించిన సమాచారం

పార్ట్ – ఎ

ఎంఐబి తో రిజిస్టర్ అయిన/ లైసెన్స్ పొందిన ప్రకారం సర్వీస్ ప్రొవైడర్ పేరు:

తరహా : …………     ( డిటిహెచ్/ఐపిటివి )                     నెల: ………………………..

పేరు, చిరునామా, సంప్రదించాల్సిన అధీకృత వ్యక్తి వివరాలు :       …………………………

 

పట్టిక ఎ1 : బ్రాడ్ కాస్టర్ తో డిటిహెచ్, ఐపిటీవీ ఇంటర్ కనెక్షన్ వివరాలు

డిటిహెచ్/ఐపిటివి ఆపరేటర్ ఒప్పందం చేసుకున్న బ్రాడ్ కాస్టర్ పేరు బ్రాడ్ కాస్టర్ రిజిస్ట్రేషన్/ లైసెన్స్ నెంబర్ ఒప్పందం సంఖ్య # ఒప్పందం కుదుర్చుకున్న ప్రాంతాలు* ఒప్పందం చేసుకున్న తేదీ ఒప్పందం అమలులో ఉండే కాలం
          ఆరంభం ముగింపు
1 2 3 4 5 6 7
             

# షెడ్యూల్ 1 లో పార్ట్ బి లో పేర్కొన్న కాలమ్ 1 కి ఇచ్చిన నోట్ చూడండి

 

టేబుల్ బి1        

ఎంఐబి తో రిజిస్టర్ అయిన/ లైసెన్స్ పొందిన ప్రకారం సర్వీస్ ప్రొవైడర్ పేరు:

తరహా : …………     ( డిటిహెచ్/ఐపిటివి )                     నెల: ………………………..

పేరు, చిరునామా, సంప్రదించాల్సిన అధీకృత వ్యక్తి వివరాలు :       …………………………

 

ఒప్పందం సంఖ్య కారేజ్ ఫీజుకు ఒప్పుకున్న

బ్రాడ్ కాస్టర్

ఒప్పుకున్న కారేజ్ ఫీజు (రూపాయల్లో) కారేజ్ ఫీజుకు యూనిట్ బ్రాడ్ కాస్టర్ తో ఒప్పుకున్న మరేదైనా ఫీజు వివరణలు
1 2 3 4 5 6 7 8