• Home »
  • BARC »
  • ఎమ్మెస్వోల అనుబంధ ఆపరేటర్ల కోసం సరళతరం చేసిన ఆన్ లైన్ ఫామ్ : ట్రాయ్

ఎమ్మెస్వోల అనుబంధ ఆపరేటర్ల కోసం సరళతరం చేసిన ఆన్ లైన్ ఫామ్ : ట్రాయ్

మూడోదశ డిజిటైజేషన్ పూర్తి కావటానికి గడువు దాదాపుగా దగ్గరపడుతుండగా దేశంలోని ప్రతి స్థానిక ఆపరేటర్ వివరాలనూ సేకరించేందుకు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) ఒక సరళతరమైన గూగుల్ ఫామ్ ని సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 60 వేలమంది కేబుల్ ఆపరేటర్లు ఉన్నట్టుగా అంచనావేస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వ సంస్థ దగ్గరా వీరికి సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో లేదు.
trai mso lco
అందుకే టెలికామ్ బ్రాడ్ కాస్టింగ్ రంగాలను నియంత్రిస్తున్న ట్రాయ్, సేవల నాణ్యతలో ప్రామాణికత సాధించే లక్ష్యంతో కృషి చేస్తోంది. సర్వీస్ ప్రొవైడర్లందరికీ సమాన అవకాశాలు కల్పించటం ద్వారా ఈ రంగంలో ఎదుగుదలకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు ట్రాయ్ చెబుతూ వస్తోంది. ఆ క్రమంలోనే కేబుల్ ఆపరేటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు, వారి హక్కులపట్ల, బాధ్యతలపట్ల అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నట్టు ప్రకటించింది.

ఎప్పటికప్పుడు తీసుకునే విధానపరమైన నిర్ణయాలగురించి, నియంత్రణలగురించి కేబుల్ ఆపరేటర్లకు తెలియజేయాలంటే వారి పేర్లు, అడ్రస్, ఈ-మెయిల్, మొబైల్ నెంబర్, కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఊరు/పట్టణం/నగరం లాంటి ప్రాథమిక సమాచారం అవసరమని ట్రాయ్ పేర్కొంది. ఆన్ లైన్ ద్వారా సేకరించే ఈ సమాచారాన్ని ట్రాయ్ డేటా బేస్ లో ఉంచుతుంది. ఆన్ లైన్ లో ఆపరేటర్ వివరాలతోబాతు సిగ్నల్స్ నేరుగా బ్రాడ్ కాస్టర్ నుంచి తెచ్చుకుంటున్నారా, ఎమ్మెస్వో నుంచి అందుతున్నాయా , తాను ఏ ఎమ్మెస్వోకు అనుసంధానమై ఉన్నదీ పేర్కొనాలి.