• Home »
  • Entertainment »
  • టీవీ నటి ప్రత్యూషా బెనర్జీ ఆత్మహత్య

టీవీ నటి ప్రత్యూషా బెనర్జీ ఆత్మహత్య

టీవీ నటి ప్రత్యూషా బెనర్జీ ఆత్మహత్య చేసుకున్నారు. బాలికా వధు ( తెలుగులో చిన్నారి పెళ్ళి కూతురు ) నటిగా ఆమె టీవీ ప్రేక్షకులకు చిరపరిచితురాలు. జంషెడ్ పూర్ లో పుట్టిన ప్రత్యూష వయసు 24 సంవత్సరాలు. ముంబై గోరెగావ్ లోని నివాసంలో ఆమె సీలింగ్ ఫాన్ కు ఉరి వేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. వెంటనే అంధేరిలోని కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్టు డాక్టర్లు నిర్థారించారు.

బాలికా వధు లో ఆమె మొదటిసారిగా బుల్లితెరకు పరిచయమయ్యారు. ఆనందిగా ప్రేక్షకుల విశేషాభిమానం పొందిన సమయంలోనే ఆమె తప్పుకున్నారు. ఆ తరువాత రియాలిటీ షో వైపు మళ్ళారు. ఝలక్ దిఖ్లాజా -5 లోను, ఆ తరువాత  బిగ్ బాస్ లోను పాల్గొన్నారు.  ఈ షోలో ఆమె కామ్యా పంజాబీ కి సన్నిహిత మిత్రురాలయ్యారు. చివరిసారిగా ససురాల్ సీమర్ కా సీరియల్లో నెగటివ్ పాత్రలో కనిపించారు. సావధాన్ ఇండియా పేరుతో ప్రసారమయ్యే క్రైమ్ కార్యక్రమంలో మహిళలమీద నేరాలకు సంబంధించిన విభాగంలో హోస్ట్ గా కూడా వ్యవహరించారు.

ప్రత్యూష ఆత్మహత్య వార్త టీవీ రంగాన్ని కుదిపేసింది. సహ నటులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రేమ  ఈ ఆత్మహత్యకు  కారణమై ఉంటుందని ప్రాథమిక సమాచారం.