• Home »
  • BARC »
  • చందా ఆదాయమా, ప్రకటనల ఆదాయమా టీవీ పరిశ్రమలో తీవ్ర చర్చలు, వ్యూహాలు

చందా ఆదాయమా, ప్రకటనల ఆదాయమా టీవీ పరిశ్రమలో తీవ్ర చర్చలు, వ్యూహాలు

పే చానల్స్ కు ఒకవైపు ప్రేక్షకులనుంచి పెద్దమొత్తంలో చందాల రూపంలో ఆదాయం వస్తున్నా మరోవైపు ప్రకటనల ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకుంటున్నాయి. అధిక లాభాల కోసం ప్రకటనల పరిమితిని సైతం పట్టించుకోవటం లేదు. చాలా దేశాలలో పే చానల్స్ అయితే ప్రకటనలు తీసుకోకూడదనే నిబంధన ఉంది. ప్రకటనల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలా, చందాల ద్వారానా అనేది చానల్స్ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

కానీ భారతదేశంలో మాత్రం  రెండు రకాల ఆదాయాలూ పొందుతున్న చానల్స్ దాదాపు సగం ఉన్నాయి. కేబుల్ టీవీ చట్టం లోని నియమాల ప్రకారం టీవీ చానల్స్ గంటకు 10 నిమిషాల వాణిజ్య ప్రకటనలు, 2 నిమిషాల సొంత ప్రచార ప్రకటనలు మాత్రమే ప్రసారం చేసుకునే అవకాశముంది. దీన్నే 10+2 నిబంధనగా పేర్కొంటారు. ట్రాయ్ ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించగానే బ్రాడ్ కాస్టర్లు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు.్

తమ ఆదాయ వనరుల విషయంలో జోక్యం చేసుకునే అధికారం ట్రాయ్ కి లేదంటూ కొంతమంది, న్యూస్ చానల్స్ లో ఎక్కువ భాగం ఉచిత చానల్స్ కాబట్టి వాటికి ఈ నిబంధన వర్తింపజేయవద్దని మరికొంతమంది, ఎంటర్టైన్మెంట్ చానల్స్  అన్నిటినీ ఒక గాటన కట్టివేయటం సమంజసం కాదని, మ్యూజిక్ చానల్స్ లాంటి చిన్న చానల్స్ ను ప్రత్యేకంగా పరిగణించి వెసులుబాటు కల్పించాలని ఇంకొంతమంది కోర్టుకెక్కారు. ఈ వ్యవహారం వాయిదాలమీద వాయిదాలు పడుతూ ముందుకు సాగుతోంది.

నిజానికి భారత పే టీవీ పరిశ్రమ అంటర్జాతీయంగాఇళ్ళ సంఖ్య దృష్ట్యా చూస్తే  అమెరికా, చైనా తరువాత మూడో స్థానంలో ఉంది. చైనాలో 37 కోట్ల 80 లక్షల పే చానల్ వాడకం ఇళ్లు ఉండగా  అమెరికాలో 11 కోట్ల 80 లక్షలున్నాయి. అంటే, అమెరికాలో ఇళ్ళలో 98% ఇళ్ళు పే చానల్స్ వాడుకుంటున్నాయి. చైనాలో అది 70 నుంచి 80% మధ్య ఉంటుంది. అయితే, వచ్చే నాలుగైదేళ్ళలో అక్కడ కూడా భారీగా డిజిటైజేషన్ జరుగుతూ ఉండటం వలన అది భారీగా పెరిగే సూచనలున్నాయి.

ఇక భారతదేశం విషయానికొస్తే 2017 లో బ్రాడ్ కాస్టింగ్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్) తీసిన లెక్కల ప్రకారం మొత్తం టీవీలున్న ళ్ళ సంఖ్య 18 కోట్ల 30 లక్షలు కాగా అందులో కేబుల్ టీవీతో అనుసంధానమైనవి 10 కోట్ల 60 లక్షలు. 4 కోట్ల 20 లక్షల ఇళ్ళకు డిటిహెచ్ కనెక్షన్లున్నాయి. దూరదర్శన్ వారి ఉచిత డిటిహెచ్, లేదా యాంటెన్న ద్వారా టీవీ అందుకునే ఇళ్ళ సంఖ్య 3 కోట్ల 50 లక్షలుంటుంది.

భారతదేశంలో పే చానల్స్, ఉచిత చానల్స్ అని రెండు రకాలుగా చానల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ఆదాయ మార్గాల్లోనూ తేడాలున్నాయి.  పే చానల్స్ కు ప్రకటనల ఆదాయంతోబాటు చందాదారులనుంచి వచ్చే చందా ఆదాయం కూడా పెద్దమొత్తంలో అందుతుంది. కానీ ఉచిత చానల్స్ కు కేవలం ప్రకటనల ఆదాయం మాత్రమే ఉంటుంది.

రేటింగ్స్ లెక్కింపులోకి బార్క్ ప్రవేశించటంతో టీవీ ఉన్న ఇళ్ళవారి కొనుగోలు శక్తిని అంచనావేసి వారి అభిరుచులకు అనుగుణంగా నడుచుకోవటం టీవీ చానల్స్ కు సులభంగా తయారైంది. అదే సమయంలో గ్రామీణ ప్రాంత ప్రేక్షకుల అభిరుచిని సైతం వెల్లడించేలా బార్క్ తన శాంపిల్స్ ను గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. ప్రేక్షకుల విద్యా స్థాయి, ఆదాయం లాంటి అంశాలను కూడా లెక్కలోకి తీసుకోవటం వలన చానల్స్ తమ వ్యూహాలను పకడ్బందీగా రూపొందించుకోవటానికి అవకాశం ఏర్పడింది. అదే సమయంలో శాంపిల్ సైజును కూడా రెట్టింపు చేయటం బార్క్ మీద విశ్వసనీయతను మరింతగా పెంచింది.

ఈ కారణాలన్నిటివలన చానల్స్ వ్యూహంలో కూడా పెనుమార్పులు తప్పలేదు. ఎక్కువమంది ప్రేక్షకులను చేరుకోవటం ద్వారా ఎక్కువ ప్రకటనలు సంపాదించుకోవటం మంచిదన్నది ఒక వ్యూహమైతే, తక్కువమంది ప్రేక్షకులైనప్పటికీ చందాల ఆదాయంతో లబ్ధి పొందాలనుకోవటం మరో వ్యూహం. ఈ నేపథ్యంలో అనేక చానల్స్ ఉచిత చానల్స్ గా మారటానికి మొగ్గు చూపటం కూదా గమనించవచ్చు.

ఇంకా చెప్పాలంటే కొన్ని చానల్స్ మామూలుగా పే చానల్స్ అయినప్పటికీ ఫ్రీడిష్ ద్వారా ఉచితంగా ఇవ్వటం ద్వారా ఎక్కువమంది ప్రేక్షకులను చేరాలనుకోవటం చూస్తున్నాం. మరికొన్ని చానల్స్ పే టీవీ ప్రసారాలనే కాస్త మార్చి. కాస్త ఆలస్యంగా ఉచిత చానల్స్ ద్వారా ప్రేక్షకులను చేరుకోవటానికి ప్రయత్నించి విజయం సాధించాయి.

ఇక ప్రకటనల కోణానికొస్తే,  టీవీ చానల్స్ కు ఏటా లభించే ప్రకటనల ఆదాయం రూ. 41 వేల కోట్లు కాగా చందాల ద్వారా వస్తున్నది రూ. 34 వేల కోట్లు. అయితే, చందా ఆదాయంలో కేవలం రూ. 10 వేలకోట్లు మాత్రమే బ్రాడ్ కాస్టర్లకు అందుతున్నదనే ఆరోపణలున్నాయి. దీనికి కారణం కేబుల్ ఆపరేటర్లు పూర్తిగా కనెక్షన్లు వెల్లడించకపోవటం, పైరసీ అనేది చానల్స్ అభిప్రాయం. అయితే, డిజిటైజేషన్ అనంతరం కనెక్షన్లు తగ్గించిచెప్పటం కుదరదు కాబట్టి ఇకమీద చానల్స్ అలాంటి ఆరోపణలు చేయటానికి వీల్లేదు.

ప్రకటనల పరిమితి వివాదం

పే చానల్స్ కు ఒకవైపు ప్రేక్షకులనుంచి పెద్దమొత్తంలో చందాల రూపంలో ఆదాయం వస్తున్నా మరోవైపు ప్రకటనల ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకుంటున్నాయి. అధిక లాభాల కోసం ప్రకటనల పరిమితిని సైతం పట్టించుకోవటం లేదు. చాలా దేశాలలో పే చానల్స్ అయితే ప్రకటనలు తీసుకోకూడదనే నిబంధన ఉంది. ప్రకటనల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలా, చందాల ద్వారానా అనేది చానల్స్ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

కానీ భారతదేశంలో మాత్రం  రెండు రకాల ఆదాయాలూ పొందుతున్న చానల్స్ దాదాపు సగం ఉన్నాయి. కేబుల్ టీవీ చట్టం లోని నియమాల ప్రకారం టీవీ చానల్స్ గంటకు 10 నిమిషాల వాణిజ్య ప్రకటనలు, 2 నిమిషాల సొంత ప్రచార ప్రకటనలు మాత్రమే ప్రసారం చేసుకునే అవకాశముంది. దీన్నే 10+2 నిబంధనగా పేర్కొంటారు. ట్రాయ్ ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించగానే బ్రాడ్ కాస్టర్లు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు.

తమ ఆదాయ వనరుల విషయంలో జోక్యం చేసుకునే అధికారం ట్రాయ్ కి లేదంటూ కొంతమంది, న్యూస్ చానల్స్ లో ఎక్కువ భాగం ఉచిత చానల్స్ కాబట్టి వాటికి ఈ నిబంధన వర్తింపజేయవద్దని మరికొంతమంది, ఎంటర్టైన్మెంట్ చానల్స్  అన్నిటినీ ఒక గాటన కట్టివేయటం సమంజసం కాదని, మ్యూజిక్ చానల్స్ లాంటి చిన్న చానల్స్ ను ప్రత్యేకంగా పరిగణించి వెసులుబాటు కల్పించాలని ఇంకొంతమంది కోర్టుకెక్కారు. ఈ వ్యవహారం వాయిదాలమీద వాయిదాలు పడుతూ ముందుకు సాగుతోంది.

ఇలా ఉండగా తాత్కాలికంగా స్టే మంజూరు చేస్తూ, చానల్స్ మీద చర్యలు తీసుకోవద్దని కోర్టు చెప్పటంతో చానల్స్ తమ ప్రకటనల హోరు కొనసాగిస్తూ వస్తున్నాయి. తాత్కాలిక స్టే మంజూరు చేసినప్పటికీ చానల్స్ తాము ఎంత సమయం ప్రకటనలు ప్రసారం చేసిందీ ఎప్పటికప్పుడు ట్రాయ్ కి నివేదించాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. ట్రాయ్ ఆ సమాచారాన్ని పొందుపరచి ప్రతి మూడు నెలలకొకసారి ఆ సమాచారాన్ని తన వెబ్ సైట్ లో ఉంచుతోంది.

అయితే, ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ చానల్స్ కు ప్రాతినిధ్యం వహించే ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ మాత్రం తమ సభ్యులు ప్రకటనలపరిమితికి కట్టుబడి ఉంటారని పేర్కొంటూ పిటిషన్ ను ఉపసంహరించుకోవటం విశేషం. మరోవైపు  న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ మాత్రం ఎక్కువ న్యూస్ చానల్స్ పే చానల్స్ కాదుగాబట్టి నష్టాలు భర్తీ చేసుకోవటానికి వీలుగా ప్రకటనలమీద పరిమితి విధించరాదంటూ కోర్టుకెక్కాయి. మరికొన్ని ప్రాంతీయ చానల్స్ తమ ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ఆదాయం సమకూర్చుకోవటానికి వీలుగా ఆంక్షలు లేకుండా చూడాలని కోరాయి. అన్ని ఎంటర్టైన్మెంట్ చానల్స్ నూ ఒకే విధంగా చూడకూడదని, ఎంటర్టైన్మెంట్ చానల్స్ కు వచ్చినట్టు తమకు ఆదాయం రాదని మ్యూజిక్ చానల్స్ కోర్టుకు తెలియజేశాయి.

ఈలోగా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోబోతున్నామంటూ కోర్టుకు చెప్పటంతో ప్రధాన పిటిషన్ వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ లోపు తమ పిటిషన్ మీద విచారణ జరపలని హోమ్ కేబుల్ పదే పదే కోర్టుకు విన్నవిస్తూ వస్తోంది. ముందుగా స్టే తొలగించాలని, కేసు తేలేదాకా 12 నిమిషాల పరిమితి పాటించేట్టు చూడాలని వాదిస్తూ వచ్చింది. నిజానికి ఈ పిటిషన్ చాలా ముందుగానే విచారణకు వచ్చినప్పటికీ అప్పటికే  ప్రకటనల పరిమితి కేసు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి సారధ్యంలోని ధర్మాసనం విచారిస్తున్నందున అక్కడికే బదలీ చేయాలని నిర్ణయించారు.

మూడేళ్ళకు పైగా ఇలా వాయిదాలమీద వాయిదాలు పడుతూ ఉండగా చానల్స్ మాత్రం యధేచ్ఛగా ప్రకటనలు ప్రసారం చేస్తూ ఆదాయం సంపాదించుకుంటున్నాయి. మరోవైపు టారిఫ్ విషయంలో కూడా ట్రాయ్ జోక్యాన్ని సహించహకుండా బాడ్ కాస్టర్లు కోర్టుకెక్కారు. ఈ రెండు కేసులలోనూ తీర్పు వెలువడి ఈ వ్యవహారం ఒక కొలిక్కి వస్తే తప్ప టీవీ పరిశ్రమ ప్రజలకు ఉపయోగపడే రీతిలో స్థిరత్వం సంపాదించుకోవట సాధ్యం కాదు.